Site icon Stotra Nidhi

Sri Samba Sada Shiva Aksharamala Stotram – శ్రీ సాంబసదాశివ అక్షరమాలా స్తోత్రం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||

అద్భుతవిగ్రహ అమరాధీశ్వర అగణితగుణగణ అమృతశివ ||

ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశ శివ ||

ఇందుకళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ ||

ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవసేవితపాద శివ ||

ఉరగాదిప్రియభూషణ శంకర నరకవినాశ నటేశ శివ ||

ఊర్జితదానవనాశ పరాత్పర ఆర్జితపాపవినాశ శివ ||

ఋగ్వేదశ్రుతిమౌళివిభూషణ రవిచంద్రాగ్ని త్రినేత్ర శివ ||

ౠపమనాది ప్రపంచవిలక్షణ తాపనివారణ తత్త్వ శివ ||

లింగస్వరూప సర్వబుధప్రియ మంగళమూర్తి మహేశ శివ ||

లూతాధీశ్వర రూపప్రియశివ వేదాంతప్రియవేద్య శివ ||

ఏకానేకస్వరూప విశ్వేశ్వర యోగిహృదిప్రియవాస శివ ||

ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశ శివ ||

ఓంకారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారాది మహేశ శివ ||

ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ ||

అంబరవాస చిదంబరనాయక తుంబురునారదసేవ్య శివ ||

ఆహారప్రియ ఆదిగిరీశ్వర భోగాదిప్రియ పూర్ణ శివ ||

కమలాక్షార్చిత కైలాసప్రియ కరుణాసాగర కాంతి శివ ||

ఖడ్గశూలమృగఢక్కాద్యాయుధ విక్రమరూప విశ్వేశ శివ ||

గంగాగిరిసుతవల్లభ గుణహిత శంకర సర్వజనేశ శివ ||

ఘాతకభంజన పాతకనాశన గౌరిసమేత గిరీశ శివ ||

ఙఙాశ్రితశ్రుతిమౌళివిభూషణ వేదస్వరూప విశ్వేశ శివ ||

చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశ శివ ||

ఛత్రకిరీటసుకుండలశోభిత పుత్రప్రియ భువనేశ శివ ||

జన్మజరామృతినాశన కల్మషరహిత తాపవినాశ శివ ||

ఝంకారాశ్రయ భృంగిరిటిప్రియ ఓంకారేశ మహేశ శివ ||

జ్ఞానాజ్ఞానవినాశక నిర్మల దీనజనప్రియ దీప్త శివ ||

టంకాద్యాయుధధారణ సత్వర హ్రీంకారైది సురేశ శివ ||

ఠంకస్వరూపా సహకారోత్తమ వాగీశ్వర వరదేశ శివ ||

డంబవినాశన డిండిమభూషణ అంబరవాస చిదీశ శివ ||

ఢంఢండమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయకసేవ్య శివ ||

ణళినవిలోచన నటనమనోహర అలికులభూషణ అమృత శివ ||

తత్త్వమసీత్యాది వాక్యస్వరూపక నిత్యానంద మహేశ శివ ||

స్థావర జంగమ భువనవిలక్షణ భావుకమునివరసేవ్య శివ ||

దుఃఖవినాశన దలితమనోన్మన చందనలేపితచరణ శివ ||

ధరణీధర శుభ ధవళవిభాస్వర ధనదాదిప్రియదాన శివ ||

నానామణిగణభూషణ నిర్గుణ నటనజనసుప్రియనాట్య శివ ||

పన్నగభూషణ పార్వతినాయక పరమానంద పరేశ శివ ||

ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ ||

బంధవినాశన బృహదీశామరస్కందాదిప్రియ కనక శివ ||

భస్మవిలేపన భవభయనాశన విస్మయరూప విశ్వేశ శివ ||

మన్మథనాశన మధుపానప్రియ మందరపర్వతవాస శివ ||

యతిజనహృదయనివాసిత ఈశ్వర విధివిష్ణ్వాది సురేశ శివ ||

రామేశ్వర రమణీయముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ ||

లంకాధీశ్వర సురగణసేవిత లావణ్యామృతలసిత శివ ||

వరదాభయకర వాసుకిభూషణ వనమాలాదివిభూష శివ ||

శాంతిస్వరూప జగత్త్రయ చిన్మయ కాంతిమతీప్రియ కనక శివ ||

షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ షాడ్గుణ్యాదిసమేత శివ ||

సంసారార్ణవనాశన శాశ్వతసాధుహృదిప్రియవాస శివ ||

హర పురుషోత్తమ అద్వైతామృతపూర్ణ మురారిసుసేవ్య శివ ||

ళాళితభక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ ||

క్షరరూపాదిప్రియాన్విత సుందర సాక్షిజగత్త్రయ స్వామి శివ ||

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||

ఇతి శ్రీసాంబసదాశివ మాతృకావర్ణమాలికా స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ శివ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.

మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments