Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
మాణిక్యాంచితభూషణాం మణిరవాం మాహేంద్రనీలోజ్జ్వలాం
మందారద్రుమమాల్యభూషితకుచాం మత్తేభకుంభస్తనీమ్ |
మౌనిస్తోమనుతాం మరాళగమనాం మాధ్వీరసానందినీం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || ౧ ||
శ్యామాం రాజనిభాననాం రతిహితాం రాజీవపత్రేక్షణాం
రాజత్కాంచనరత్నభూషణయుతాం రాజ్యప్రదానేశ్వరీమ్ |
రక్షోగర్వనివారణాం త్రిజగతాం రక్షైకచింతామణిం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || ౨ ||
కల్యాణీం కరికుంభభాసురకుచాం కామేశ్వరీం కామినీం
కల్యాణాచలవాసినీం కలరవాం కందర్పవిద్యాకలామ్ |
కంజాక్షీం కలబిందుకల్పలతికాం కామారిచిత్తప్రియాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || ౩ ||
భావాతీతమనఃప్రభావభరితాం బ్రహ్మాండభాండోదరీం
బాలాం బాలకురంగనేత్రయుగళాం భానుప్రభాభాసితామ్ |
భాస్వత్క్షేత్రరుచాభిరామనిలయాం భవ్యాం భవానీం శివాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || ౪ ||
వీణాగానవినోదినీం విజయినీం వేతండకుంభస్తనీం
విద్వద్వందితపాదపద్మయుగళాం విద్యాప్రదాం శాంకరీమ్ |
విద్వేషిణ్యభిరంజినీం స్తుతివిభాం వేదాంతవేద్యాం శివాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || ౫ ||
నానాభూషితభూషణాదివిమలాం లావణ్యపాథోనిధిం
కాంచీచంచలఘంటికాకలరవాం కంజాతపత్రేక్షణామ్ |
కర్పూరాగరుకుంకుమాంకితకుచాం కైలాసనాథప్రియాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || ౬ ||
మంజీరాంచితపాదపద్మయుగళాం మాణిక్యభూషాన్వితాం
మందారద్రుమమంజరీమధుఝరీమాధుర్యఖేలద్గిరామ్ |
మాతంగీం మధురాలసాం కరశుకాం నీలాలకాలంకృతాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || ౭ ||
కర్ణాలంబితహేమకుండలయుగాం కాదంబవేణీముమాం
అంభోజాసనవాసవాదివినుతామర్ధేందుభూషోజ్జ్వలామ్ |
కస్తూరీతిలకాభిరామనిటిలాం గానప్రియాం శ్యామలాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || ౮ ||
కౌమారీం నవపల్లవాంఘ్రియుగళాం కర్పూరభాసోజ్జ్వలాం
గంగావర్తసమాననాభికుహరాం గాంగేయభూషాన్వితామ్ |
చంద్రార్కానలకోటికోటిసదృశాం చంద్రార్కబింబాననాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || ౯ ||
బాలాదిత్యనిభాననాం త్రినయనాం బాలేందునా భూషితాం
నీలాకారసుకేశినీ విలసితాం నిత్యాన్నదానప్రదామ్ |
శంఖం చక్రవరాభయం చ దధతీం సారస్వతార్థప్రదాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || ౧౦ ||
ఇతి శ్రీ జ్ఞానప్రసూనాంబికా స్తోత్రమ్ |
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.