Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః 1 >>
ఈశ్వర ఉవాచ |
శతనామ ప్రవక్ష్యామి శృణుష్వ కమలాననే |
యస్య ప్రసాదమాత్రేణ దుర్గా ప్రీతా సదా భవేత్ || ౧ ||
సతీ సాధ్వీ భవప్రీతా భవానీ భవమోచనీ |
ఆర్యా దుర్గా జయా ఆద్యా త్రినేత్రా శూలధారిణీ || ౨ ||
పినాకధారిణీ చిత్రా చంద్రఘంటా మహాతపా |
మనోబుద్ధిరహంకారా చిత్తరూపా చితా చితిః || ౩ ||
సర్వమంత్రమయీ సత్యా సత్యానందస్వరూపిణీ |
అనంతా భావినీ భావ్యా భవా భవ్యా సదాగతిః || ౪ ||
శంభుపత్నీ దేవమాతా చింతా రత్నప్రియా సదా |
సర్వవిద్యా దక్షకన్యా దక్షయజ్ఞవినాశినీ || ౫ ||
అపర్ణా చైవ పర్ణా చ పాటలా పాటలావతీ |
పట్టాంబరపరీధానా కలమంజీరరంజినీ || ౬ ||
అమేయా విక్రమా క్రూరా సుందరీ సురసుందరీ |
వనదుర్గా చ మాతంగీ మతంగమునిపూజితా || ౭ ||
బ్రాహ్మీ మాహేశ్వరీ చైంద్రీ కౌమారీ వైష్ణవీ తథా |
చాముండా చైవ వారాహీ లక్ష్మీశ్చ పురుషాకృతిః || ౮ ||
విమలోత్కర్షిణీ జ్ఞానక్రియా సత్యా చ వాక్ప్రదా |
బహులా బహులప్రేమా సర్వవాహనవాహనా || ౯ ||
నిశుంభశుంభహననీ మహిషాసురమర్దినీ |
మధుకైటభహంత్రీ చ చండముండవినాశినీ || ౧౦ ||
సర్వాసురవినాశా చ సర్వదానవఘాతినీ |
సర్వశాస్త్రమయీ విద్యా సర్వాస్త్రధారిణీ తథా || ౧౧ ||
అనేకశస్త్రహస్తా చ అనేకాస్త్రవిధారిణీ |
కుమారీ చైవ కన్యా చ కౌమారీ యువతీ యతిః || ౧౨ ||
అప్రౌఢా చైవ ప్రౌఢా చ వృద్ధమాతా బలప్రదా |
శ్రద్ధా శాంతిర్ధృతిః కాంతిర్లక్ష్మీర్జాతిః స్మృతిర్దయా || ౧౩ ||
తుష్టిః పుష్టిశ్చితిర్భ్రాంతిర్మాతా క్షుచ్చేతనా మతిః |
విష్ణుమాయా చ నిద్రా చ ఛాయా కామప్రపూరణీ || ౧౪ ||
య ఇదం చ పఠేత్ స్తోత్రం దుర్గానామశతాష్టకమ్ |
నాసాధ్యం విద్యతే దేవి త్రిషు లోకేషు పార్వతి || ౧౫ ||
ధనం ధాన్యం సుతన్ జాయాం హయం హస్తినమేవ చ |
చతుర్వర్గం తథా చాంతే లభేన్ముక్తిం చ శాశ్వతీమ్ || ౧౬ ||
కుమారీః పూజయిత్వా తు ధ్యాత్వా దేవీం సురేశ్వరీమ్ |
పూజయేత్పరయా భక్త్యా పఠేన్నామశతాష్టకమ్ || ౧౭ ||
తస్య సిద్ధిర్భవేద్దేవి సర్వైః సురవరైరపి |
రాజానో దాసతాం యాంతి రాజ్యశ్రియమవాప్నుయాత్ || ౧౮ ||
గోరోచనాలక్తకకుంకుమేన సిందూరకర్పూరమధుత్రయేణ |
విలిఖ్య యంత్రం విధినా విధిజ్ఞో భవేత్సదా ధారయతా పురారిః || ౧౯ ||
భౌమావాస్యా నిశాభాగే చంద్రే శతభిషాం గతే |
విలిఖ్య ప్రపఠేత్ స్తోత్రం స భవేత్ సంపదాం పదమ్ || ౨౦ ||
ఇతి శ్రీవిశ్వసారతంత్రే శ్రీ దుర్గాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దుర్గా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ దుర్గా స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.