Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ఓంకారరూప శబరీవరపీఠదీప
శృంగార రంగ రమణీయ కలాకలాప |
అంగారవర్ణ మణికంఠ మహత్ప్రతాప
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౧ ||
నక్షత్రచారునఖరప్రద నిష్కళంక
నక్షత్రనాథముఖ నిర్మలచిత్తరంగ |
కుక్షిస్థలస్థిత చరాచర భూతసంఘ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౨ ||
మంత్రార్థ తత్త్వ నిగమార్థ మహావరిష్ఠ
యంత్రాది తంత్ర వరవర్ణిత పుష్కలేష్ట |
సంత్రాసితారికుల పద్మసుఖోపవిష్ట
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౩ ||
శిక్షాపరాయణ శివాత్మజ సర్వభూత-
-రక్షాపరాయణ చరాచర హేతుభూత |
అక్షయ్య మంగళ వరప్రద చిత్ప్రబోధ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౪ ||
వాగీశవర్ణిత విశిష్టవచోవిలాస
యోగీశ యోగకర యాగఫలప్రకాశ |
యోగేశ యోగి పరమాత్మ హితోపదేశ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౫ ||
యక్షేశపూజ్య నిధిసంచయ నిత్యపాల
యక్షీశ కాంక్షిత సులక్షణ లక్ష్యమూల |
అక్షీణ పుణ్య నిజభక్తజనానుకూల
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౬ ||
స్వామిన్ ప్రభారమణ చందనలిప్తదేహ
చామీకరాభరణ చారుతురంగవాహ |
శ్రీమత్సురాభరణ శాశ్వతసత్సమూహ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౭ ||
ఆతామ్రహేమరుచిరంజిత మంజుగాత్ర
వేదాంతవేద్య విధివర్ణిత వీర్యవేత్ర |
పాదారవింద పరిపావన భక్తమిత్ర
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౮ ||
బాలామృతాంశు పరిశోభిత ఫాలచిత్రా
నీలాలిపాలిఘనకుంతల దివ్యసూత్ర |
లీలావినోద మృగయాపర సచ్చరిత్ర
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౯ ||
భూతిప్రదాయక జగత్ప్రథితప్రతాప
భీతిప్రమోచక విశాలకలాకలాప |
బోధప్రదీప భవతాపహరస్వరూప
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౧౦ ||
వేతాళభూతపరివారవినోదశీల
పాతాళభూమి సురలోక సుఖానుకూల |
నాదాంతరంగ నతకల్పక ధర్మపాల
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౧౧ ||
శార్దూలదుగ్ధహర సర్వరుజాపహార
శాస్త్రానుసార పరసాత్త్విక హృద్విహార |
శస్త్రాస్త్ర శక్తిధర మౌక్తికముగ్ధహార
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౧౨ ||
ఆదిత్యకోటిరుచిరంజిత వేదసార
ఆధారభూత భువనైక హితావతార |
ఆదిప్రమాథిపదసారస పాపదూర
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౧౩ ||
పంచాద్రివాస పరమాద్భుతభావనీయ
పింఛావతంసమకుటోజ్జ్వల పూజనీయ |
వాంఛానుకూల వరదాయక సత్సహాయ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౧౪ ||
హింసావిహీన శరణాగతపారిజాత
సంసారసాగరసముత్తరణైకపోత |
హంసాదిసేవిత విభో పరమాత్మబోధ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౧౫ ||
కుంభీంద్ర కేసరి తురంగమ వాహ తుంగ
గంభీర వీర మణికంఠ విమోహనాంగ |
కుంభోద్భవాది వరతాపసచిత్తరంగ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౧౬ ||
సంపూర్ణ భక్తవర సంతతి దానశీల
సంపత్సుఖప్రద సనాతన గానలోల |
సంపూరితాఖిల చరాచరలోకపాల
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౧౭ ||
వీరాసనస్థిత విచిత్రవనాధివాస
నారాయణప్రియ నటేశ మనోవిలాస |
వారాశిపూర్ణ కరుణామృత వాగ్వికాస
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౧౮ ||
క్షిప్రప్రసాదక సురాసురసేవ్యపాద
విప్రాదివందిత వరప్రద సుప్రసాద |
విభ్రాజమాన మణికంఠ వినోదభూత
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౧౯ ||
కోటీరచారుతర కోటిదివాకరాభ
పాటీరపంకకలభప్రియ పూర్ణశోభ |
వాటీవనాంతరవిహార విచిత్రరూప
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౨౦ ||
దుర్వారదుఃఖహర దీనజనానుకూల
దుర్వాస తాపస వరార్చిత పాదమూల |
దర్వీకరేంద్ర మణిభూషణ ధర్మపాల
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౨౧ ||
నృత్తాభిరమ్య నిగమాగమ సాక్షిభూత
భక్తానుగమ్య పరమాద్భుత హృత్ప్రబోధ |
సత్తాపసార్చిత సనాతన మోక్షభూత
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౨౨ ||
కందర్పకోటి కమనీయకరావతార
మందార కుంద సుమవృంద మనోజ్ఞహార |
మందాకినీతటవిహార వినోదపూర
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౨౩ ||
సత్కీర్తనప్రియ సమస్తసురాధినాథ
సత్కారసాధు హృదయాంబుజ సన్నికేత |
సత్కీర్తిసౌఖ్య వరదాయక సత్కిరాత
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౨౪ ||
జ్ఞానప్రపూజిత పదాంబుజ భూతిభూష
దీనానుకంపిత దయాపర దివ్యవేష |
జ్ఞానస్వరూప వరచక్షుష వేదఘోష
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౨౫ ||
నాదాంతరంగ వరమంగళనృత్తరంగ-
-పాదారవింద కుసుమాయుధ కోమలాంగ |
మాతంగకేసరితురంగమవాహతుంగ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౨౬ ||
బ్రహ్మస్వరూప భవరోగపురాణవైద్య
ధర్మార్థకామవరముక్తిద వేదవేద్య |
కర్మానుకూలఫలదాయక చిన్మయాద్య
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౨౭ ||
తాపత్రయాపహర తాపసహృద్విహార
తాపింఛ చారుతరగాత్ర కిరాతవీర |
ఆపాదమస్తక లసన్మణిముక్తహార
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౨౮ ||
చింతామణిప్రథిత భూషణభూషితాంగ
దంతావలేంద్ర హరివాహన మోహనాంగ |
సంతానదాయక విభో కరుణాంతరంగ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౨౯ ||
ఆరణ్యవాస వరతాపస బోధరూప
కారుణ్యసాగర కలేశ కలాకలాప |
తారుణ్య తామర సులోచన లోకదీప
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౩౦ ||
ఆపాద చారుతర కామసమాభిరామ
శోభాయమాన సురసంచయ సార్వభౌమ |
శ్రీపాండ్య పూర్వసుకృతామృత పూర్ణధామ
శ్రీభూతనాథ మమ దేహి కరావలంబమ్ || ౩౧ ||
ఇతి శ్రీ భూతనాథ కరావలంబ స్తవః |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ అయ్యప్ప స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.