Site icon Stotra Nidhi

Sri Bhaskara Ashtakam (with Telugu Meaning) – శ్రీ భాస్కరాష్టకం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సూర్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

(ఈ అష్టకం సూర్యుని ‘భాస్కర’ (కాంతిని ఇచ్చేవాడు) స్వరూపాన్ని స్తుతిస్తుంది. సూర్యుడు కేవలం ఒక గ్రహం మాత్రమే కాదని, ఆయనలో త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, శివ) కొలువై ఉన్నారని, ఆయనే సమస్త లోకానికి బంధువని ఈ స్తోత్రం చాటిచెబుతుంది. ఫలితం: దీర్ఘాయువు, కష్ట నివారణ, పాప, రోగ హరణం)

శ్రీపద్మినీశమరుణోజ్జ్వలకాంతిమంతం
మౌనీంద్రవృందసురవందితపాదపద్మమ్ |
నీరేజసంభవముకుందశివస్వరూపం
శ్రీభాస్కరం భువనబాంధవమాశ్రయామి || ౧ ||

పద్మినీదేవికి (పద్మములకు) ప్రభువును, ఉదయకాలపు ఎర్రని వెలుగుతో ప్రకాశించువానిని, మునీంద్రుల సమూహము మరియు దేవతలచే వందింపబడిన పాదపద్మములు కలవానిని, బ్రహ్మ-విష్ణు-శివ స్వరూపుడైనవానిని, శ్రీభాస్కరుని, భువనములకు బంధువైనవానిని నేను ఆశ్రయించుచున్నాను.

మార్తాండమీశమఖిలాత్మకమంశుమంత-
-మానందరూపమణిమాదికసిద్ధిదం చ |
ఆద్యంతమధ్యరహితం చ శివప్రదం త్వాం
శ్రీభాస్కరం నతజనాశ్రయమాశ్రయామి || ౨ ||

మార్తాండుని, ఈశ్వరుని, సర్వాత్మకుని, కిరణములు కలవానిని, ఆనంద స్వరూపుని, అణిమాది అష్టసిద్ధులను ఇచ్చువానిని, ఆది-అంతము-మధ్య లేనివానిని, శుభములను (శివము) ప్రసాదించు నీవు, నమస్కరించిన జనములకు ఆశ్రయుడవైన శ్రీభాస్కరుని నేను ఆశ్రయించుచున్నాను.

సప్తాశ్వమభ్రమణిమాశ్రితపారిజాతం
జాంబూనదాభమతినిర్మలదృష్టిదం చ |
దివ్యాంబరాభరణభూషితచారుమూర్తిం
శ్రీభాస్కరం గ్రహగణాధిపమాశ్రయామి || ౩ ||

ఏడు గుర్రములు కలవానిని, ఆకాశమునకు మణి వంటివానిని, ఆశ్రయించిన వారికి పారిజాత వృక్షము వంటివానిని, బంగారు ఛాయ కలవానిని, మిక్కిలి నిర్మలమైన దృష్టిని ఇచ్చువానిని, దివ్యమైన వస్త్రములు ఆభరణములతో అలంకరింపబడిన సుందర మూర్తిని, గ్రహ సమూహములకు అధిపతియైన శ్రీభాస్కరుని నేను ఆశ్రయించుచున్నాను.

పాపార్తిరోగభయదుఃఖహరం శరణ్యం
సంసారగాఢతమసాగరతారకం చ |
హంసాత్మకం నిగమవేద్యమహస్కరం త్వాం
శ్రీభాస్కరం కమలబాంధవమాశ్రయామి || ౪ ||

పాపములను, ఆర్తిని, రోగములను, భయమును, దుఃఖమును హరించువానిని, శరణు పొందదగినవానిని, గాఢమైన సంసార సముద్రమును దాటించువానిని, హంస స్వరూపుని (పరమాత్మను), వేదములచే తెలియబడేవానిని, పగలును కలిగించు (అహస్కరం) నీవు, కమలములకు బంధువైన శ్రీభాస్కరుని నేను ఆశ్రయించుచున్నాను.

ప్రత్యక్షదైవమచలాత్మకమచ్యుతం చ
భక్తప్రియం సకలసాక్షిణమప్రమేయమ్ |
సర్వాత్మకం సకలలోకహరం ప్రసన్నం
శ్రీభాస్కరం జగదధీశ్వరమాశ్రయామి || ౫ ||

కళ్లముందు కనిపించే దైవమును, చలించని ఆత్మ స్వరూపుని, నాశనము లేనివానిని (అచ్యుతుని), భక్తులకు ప్రియమైనవానిని, సర్వమునకు సాక్షిగా ఉన్నవానిని, కొలవలేనట్టివానిని (అప్రమేయుని), సర్వాత్మకుని, లోకముల పాపములను హరించువానిని, ప్రసన్నమైనవానిని, జగదీశ్వరుడైన శ్రీభాస్కరుని నేను ఆశ్రయించుచున్నాను.

జ్యోతిస్వరూపమఘసంచయనాశకం చ |
తాపత్రయాంతకమనంతసుఖప్రదం చ |
కాలాత్మకం గ్రహగణేన సుసేవితం చ |
శ్రీభాస్కరం భువనరక్షకమాశ్రయామి || ౬ ||

జ్యోతి స్వరూపుని, పాపముల రాశిని నాశనము చేయువానిని, మూడు తాపములను అంతము చేయువానిని, అనంతమైన సుఖమును ఇచ్చువానిని, కాల స్వరూపుని, గ్రహముల సమూహముచే చక్కగా సేవింపబడువానిని, లోక రక్షకుడైన శ్రీభాస్కరుని నేను ఆశ్రయించుచున్నాను.

సృష్టిస్థితిప్రళయకారణమీశ్వరం చ
దృష్టిప్రదం పరమతుష్టిదమాశ్రితానామ్ |
ఇష్టార్థదం సకలకష్టనివారకం చ
శ్రీభాస్కరం మృగపతీశ్వరమాశ్రయామి || ౭ ||

సృష్టి, స్థితి, లయములకు కారణమైన ఈశ్వరుని, దృష్టిని ప్రసాదించువానిని, ఆశ్రయించిన వారికి పరమ తృప్తిని ఇచ్చువానిని, కోరిన కోర్కెలు తీర్చువానిని, సమస్త కష్టములను తొలగించువానిని, సింహరాశికి ప్రభువైన (మృగపతీశ్వర) శ్రీభాస్కరుని నేను ఆశ్రయించుచున్నాను.

ఆదిత్యమార్తజనరక్షకమవ్యయం చ
ఛాయాధవం కనకరేతసమగ్నిగర్భమ్ |
సూర్యం కృపాలుమఖిలాశ్రయమాదిదేవం
లక్ష్మీనృసింహకవిపాలకమాశ్రయామి || ౮ ||

ఆదిత్యుని, పీడింపబడు జనులను రక్షించువానిని, మార్పు లేనివానిని (అవ్యయుని), ఛాయాదేవి భర్తను, బంగారు తేజస్సు కలవానిని, అగ్నిని గర్భమున కలవానిని, కరుణామయుడైన సూర్యుని, అందరికీ ఆశ్రయమైన ఆదిదేవుని, లక్ష్మీనృసింహ కవిని పాలించువానిని నేను ఆశ్రయించుచున్నాను.

శ్రీభాస్కరాష్టకమిదం పరమం పవిత్రం
యత్ర శ్రుతం చ పఠితం సతతం స్మృతం చ |
తత్ర స్థిరాణి కమలాప్తకృపావిలాసై-
-ర్దీర్ఘాయురర్థబలవీర్యసుతాదికాని || ౯ ||

పరమ పవిత్రమైన ఈ శ్రీ భాస్కరాష్టకము ఎక్కడైతే వినబడుతుందో, పఠింపబడుతుందో లేదా నిరంతరం స్మరింపబడుతుందో, అక్కడ సూర్యుని కృపా కటాక్షములతో దీర్ఘాయువు, సంపద, బలము, వీర్యము, సంతానము మొదలైనవి స్థిరముగా లభించును.

ఇతి శ్రీ భాస్కరాష్టకమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ సూర్య స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ సూర్య స్తోత్రాలు చూడండి. మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.

మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments