Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
మహాశాస్తా మహాదేవో మహాదేవసుతోఽవ్యయః |
లోకకర్తా లోకభర్తా లోకహర్తా పరాత్పరః || ౧ ||
త్రిలోకరక్షకో ధన్వీ తపస్వీ భూతసైనికః |
మంత్రవేదీ మహావేదీ మారుతో జగదీశ్వరః || ౨ ||
లోకాధ్యక్షోఽగ్రణీః శ్రీమానప్రమేయపరాక్రమః |
సింహారూఢో గజారూఢో హయారూఢో మహేశ్వరః || ౩ ||
నానాశస్త్రధరోఽనర్ఘో నానావిద్యావిశారదః |
నానారూపధరో వీరో నానాప్రాణినిషేవితః || ౪ ||
భూతేశో భూతిదో భృత్యో భుజంగాభరణోత్తమః |
ఇక్షుధన్వీ పుష్పబాణో మహారూపో మహాప్రభుః || ౫ ||
మాయాదేవీసుతో మాన్యో మహానీతో మహాగుణః |
మహాశైవో మహారుద్రో వైష్ణవో విష్ణుపూజకః || ౬ ||
విఘ్నేశో వీరభద్రేశో భైరవో షణ్ముఖధ్రువః | [ప్రియః]
మేరుశృంగసమాసీనో మునిసంఘనిషేవితః || ౭ ||
దేవో భద్రో జగన్నాథో గణనాథో గణేశ్వరః |
మహాయోగీ మహామాయీ మహాజ్ఞానీ మహాస్థిరః || ౮ ||
దేవశాస్తా భూతశాస్తా భీమహాసపరాక్రమః |
నాగహారో నాగకేశో వ్యోమకేశః సనాతనః || ౯ ||
సగుణో నిర్గుణో నిత్యో నిత్యతృప్తో నిరాశ్రయః |
లోకాశ్రయో గణాధీశశ్చతుష్షష్టికలామయః || ౧౦ ||
ఋగ్యజుఃసామరూపీ చ మల్లకాసురభంజనః |
త్రిమూర్తిర్దైత్యమథనో ప్రకృతిః పురుషోత్తమః || ౧౧ ||
కాలజ్ఞానీ మహాజ్ఞానీ కామదః కమలేక్షణః |
కల్పవృక్షో మహావృక్షో విద్యావృక్షో విభూతిదః || ౧౨ ||
సంసారతాపవిచ్ఛేత్తా పశులోకభయంకరః |
రోగహంతా ప్రాణదాతా పరగర్వవిభంజనః || ౧౩ ||
సర్వశాస్త్రార్థతత్వజ్ఞో నీతిమాన్ పాపభంజనః |
పుష్కలాపూర్ణసంయుక్తో పరమాత్మా సతాంగతిః || ౧౪ ||
అనంతాదిత్యసంకాశః సుబ్రహ్మణ్యానుజో బలీ |
భక్తానుకంపీ దేవేశో భగవాన్ భక్తవత్సలః || ౧౫ ||
ఇతి శ్రీ అయ్యప్ప అష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ అయ్యప్ప స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.