Site icon Stotra Nidhi

Sri Yoga Meenakshi Stotram – శ్రీ యోగమీనాక్షీ స్తోత్రం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

శివానందపీయూషరత్నాకరస్థాం
శివబ్రహ్మవిష్ణ్వామరేశాభివంద్యామ్ |
శివధ్యానలగ్నాం శివజ్ఞానమూర్తిం
శివాఖ్యామతీతాం భజే పాండ్యబాలామ్ || ౧ ||

శివాదిస్ఫురత్పంచమంచాధిరూఢాం
ధనుర్బాణపాశాంకుశోద్భాసిహస్తామ్ |
నవీనార్కవర్ణాం నవీనేందుచూడాం
పరబ్రహ్మపత్నీం భజే పాండ్యబాలామ్ || ౨ ||

కిరీటాంగదోద్భాసిమాంగళ్యసూత్రాం
స్ఫురన్మేఖలాహారతాటంకభూషామ్ |
పరామంత్రకాం పాండ్యసింహాసనస్థాం
పరంధామరూపాం భజే పాండ్యబాలామ్ || ౩ ||

లలామాంచితస్నిగ్ధఫాలేందుభాగాం
లసన్నీరజోత్ఫుల్లకల్హారసంస్థామ్ |
లలాటేక్షణార్ధాంగలగ్నోజ్జ్వలాంగీం
పరంధామరూపాం భజే పాండ్యబాలామ్ || ౪ ||

త్రిఖండాత్మవిద్యాం త్రిబిందుస్వరూపాం
త్రికోణే లసంతీం త్రిలోకావనమ్రామ్ |
త్రిబీజాధిరూఢాం త్రిమూర్త్యాత్మవిద్యాం
పరబ్రహ్మపత్నీం భజే పాండ్యబాలామ్ || ౫ ||

సదా బిందుమధ్యోల్లసద్వేణిరమ్యాం
సముత్తుంగవక్షోజభారావనమ్రామ్ |
క్వణన్నూపురోపేతలాక్షారసార్ద్ర-
-స్ఫురత్పాదపద్మాం భజే పాండ్యబాలామ్ || ౬ ||

యమాద్యష్టయోగాంగరూపామరూపా-
-మకారాత్క్షకారాంతవర్ణామవర్ణామ్ |
అఖండామనన్యామచింత్యామలక్ష్యా-
-మమేయాత్మవిద్యాం భజే పాండ్యబాలామ్ || ౭ ||

సుధాసాగరాంతే మణిద్వీపమధ్యే
లసత్కల్పవృక్షోజ్జ్వలద్బిందుచక్రే |
మహాయోగపీఠే శివాకారమంచే
సదా సన్నిషణ్ణాం భజే పాండ్యబాలామ్ || ౮ ||

సుషుమ్నాంతరంధ్రే సహస్రారపద్మే
రవీంద్వగ్నిసమ్యుక్తచిచ్చక్రమధ్యే |
సుధామండలస్థే సునిర్వాణపీఠే
సదా సంచరంతీం భజే పాండ్యబాలామ్ || ౯ ||

షడంతే నవాంతే లసద్ద్వాదశాంతే
మహాబిందుమధ్యే సునాదాంతరాళే |
శివాఖ్యే కళాతీతనిశ్శబ్దదేశే
సదా సంచరంతీం భజే పాండ్యబాలామ్ || ౧౦ ||

చతుర్మార్గమధ్యే సుకోణాంతరంగే
ఖరంధ్రే సుధాకారకూపాంతరాళే |
నిరాలంబపద్మే కళాషోడశాంతే
సదా సంచరంతీం భజే పాండ్యబాలామ్ || ౧౧ ||

పుటద్వంద్వనిర్ముక్తవాయుప్రలీన-
-ప్రకాశాంతరాళే ధ్రువోపేతరమ్యే |
మహాషోడశాంతే మనోనాశదేశే
సదా సంచరంతీం భజే పాండ్యబాలామ్ || ౧౨ ||

చతుష్పత్రమధ్యే సుకోణత్రయాంతే
త్రిమూర్త్యాధివాసే త్రిమార్గాంతరాళే |
సహస్రారపద్మోచితాం చిత్ప్రకాశ-
-ప్రవాహప్రలీనాం భజే పాండ్యబాలామ్ || ౧౩ ||

లసద్ద్వాదశాంతేందుపీయూషధారా-
-వృతాం మూర్తిమానందమగ్నాంతరంగామ్ |
పరాం త్రిస్తనీం తాం చతుష్కూటమధ్యే
పరంధామరూపాం భజే పాండ్యబాలామ్ || ౧౪ ||

సహస్రారపద్మే సుషుమ్నాంతమార్గే
స్ఫురచ్చంద్రపీయూషధారాం పిబంతీమ్ |
సదా స్రావయంతీం సుధామూర్తిమంబాం
పరంజ్యోతిరూపాం భజే పాండ్యబాలామ్ || ౧౫ ||

నమస్తే సదా పాండ్యరాజేంద్రకన్యే
నమస్తే సదా సుందరేశాంకవాసే |
నమస్తే నమస్తే సుమీనాక్షి దేవి
నమస్తే నమస్తే పునస్తే నమోఽస్తు || ౧౬ ||

ఇతి అగస్త్య కృత శ్రీ యోగమీనాక్షీ స్తోత్రమ్ |


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments