Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీరామచంద్రశ్రీకృష్ణ సూర్యచంద్రకులోద్భవౌ |
కౌసల్యాదేవకీపుత్రౌ రామకృష్ణౌ గతిర్మమ || ౧ ||
దివ్యరూపౌ దశరథవసుదేవాత్మసంభవౌ |
జానకీరుక్మిణీకాంతౌ రామకృష్ణౌ గతిర్మమ || ౨ ||
ఆయోధ్యాద్వారకాధీశౌ శ్రీమద్రాఘవయాదవౌ |
శ్రీకాకుత్స్థేంద్రరాజేంద్రౌ రామకృష్ణౌ గతిర్మమ || ౩ ||
శాంతాసుభద్రాసోదర్యౌ సౌమిత్రీగదపూర్వజౌ |
త్రేతాద్వాపరసంభూతౌ రామకృష్ణౌ గతిర్మమ || ౪ ||
విళంబివిశ్వావసుజౌ సౌమ్యదక్షాయణోద్భవౌ |
వసంతవర్షఋతుజౌ రామకృష్ణౌ గతిర్మమ || ౫ ||
చైత్రశ్రావణసంభూతౌ మేషసింహాఖ్యమాసజౌ |
సితాసితదళోద్భూతౌ రామకృష్ణౌ గతిర్మమ || ౬ ||
నవమీస్వష్టమీజాతౌ సౌమ్యవాసరసంభవౌ |
అదితిబ్రహ్మతారాజౌ రామకృష్ణౌ గతిర్మమ || ౭ ||
మధ్యాహ్నార్ధనిశోత్పన్నౌ కుళీరవృషలగ్నజౌ |
ద్వాత్రింశల్లక్షణోపేతౌ రామకృష్ణౌ గతిర్మమ || ౮ ||
దూర్వాదళఘనశ్యామౌ ద్విచతుర్బాహుసంభవౌ |
కోదండచక్రహస్తాబ్జౌ రామకృష్ణౌ గతిర్మమ || ౯ ||
వశిష్ఠగార్గ్యసచివౌ సిద్ధార్థోద్ధవమంత్రిణౌ |
గాధేయసాందీపిశిష్యౌ రామకృష్ణౌ గతిర్మమ || ౧౦ ||
లవప్రద్యుమ్నజనకౌ కుశసాంబసితాన్వితౌ |
హనుమద్గరుడారూఢౌ రామకృష్ణౌ గతిర్మమ || ౧౧ ||
తాటకాపూతనారాతి ఖరకంసశిరోహరౌ |
కాకకాళీయదర్పఘ్నౌ రామకృష్ణౌ గతిర్మమ || ౧౨ ||
కబంధనరకారాతీ విరాధమురమర్దనౌ |
దశాస్యశిశుపాలఘ్నౌ రామకృష్ణౌ గతిర్మమ || ౧౩ ||
అహల్యానృపశాపఘ్నౌ శివకంసధనుర్భిదౌ |
లీలామానుషరూపాఢ్యౌ రామకృష్ణౌ గతిర్మమ || ౧౪ ||
దండకారణ్యసంచారీ బృందావనవిహారిణౌ |
ఏకాఽనేకకళత్రాఢ్యౌ రామకృష్ణౌ గతిర్మమ || ౧౫ ||
శబరీ ద్రౌపదీపూజ్యౌ జటాయుర్భీష్మముక్తిదౌ |
మునిపాండవసంరక్షౌ రామకృష్ణౌ గతిర్మమ || ౧౬ ||
జామదగ్న్యాహంకృతిఘ్న బాణాసురమదాపహౌ |
జయాన్వితౌ జగత్పూజ్యౌ రామకృష్ణౌ గతిర్మమ || ౧౭ ||
పితృవాక్యైకనిరతౌ పితృబంధవిమోచకౌ |
చీరపీతాంబరధరౌ రామకృష్ణౌ గతిర్మమ || ౧౮ ||
సుమంత్రదారుకాభిఖ్యౌ సారథీజగదీశ్వరౌ |
గుహపార్థప్రియసఖౌ రామకృష్ణౌ గతిర్మమ || ౧౯ ||
పరంతపౌ శూర్పణఖారుక్మివైరూప్యకారిణౌ |
జంబూకశంఖచూడఘ్నౌ రామకృష్ణౌ గతిర్మమ || ౨౦ ||
సముద్రసేతునిర్మాతృ సముద్రకృతపత్తనౌ |
మహాసత్వమహామాయౌ రామకృష్ణౌ గతిర్మమ || ౨౧ ||
వీరౌ విశ్వామిత్రధర్మయజ్ఞరక్షణతత్పరౌ |
దృఢవ్రతౌ సుచరితౌ రామకృష్ణౌ గతిర్మమ || ౨౨ ||
త్రిజటాఖ్య కుచేలాఖ్య ద్విజదారిద్ర్యహారిణౌ |
యోగిధ్యేయపదాంభోజౌ రామకృష్ణౌ గతిర్మమ || ౨౩ ||
మహాత్మానౌ సప్తతాళయమళార్జునభంజనౌ |
మారుతాక్రూరవరదౌ రామకృష్ణౌ గతిర్మమ || ౨౪ ||
శివోపదిష్టగీతార్థ పార్థగీతోపదేశకౌ |
వార్ధీశ శక్రమానఘ్నౌ రామకృష్ణౌ గతిర్మమ || ౨౫ ||
దేవదేవౌ కుంభకర్ణ దంతవక్త్రనిషూదనౌ |
వాలిపౌండ్రకహంతారౌ రామకృష్ణౌ గతిర్మమ || ౨౬ ||
దూషణత్రిశిరోహంతృ సాల్వాఘాసురసూదనౌ |
మారీచ శకటధ్వంసౌ రామకృష్ణౌ గతిర్మమ || ౨౭ ||
సుగ్రీవేష్ట జరాసంధ తనయేప్సితరాజ్యదౌ |
సత్యవాక్ సత్యసంకల్పౌ రామకృష్ణౌ గతిర్మమ || ౨౮ ||
విభీషణాభయశ్రీద భగదత్తాఽభయప్రదౌ |
జటాజూటకిరీటాద్యౌ రామకృష్ణౌ గతిర్మమ || ౨౯ ||
చిత్రకూటాచలావాసి రైవతాచలలోలుపౌ |
సర్వభూతహృదావాసౌ రామకృష్ణౌ గతిర్మమ || ౩౦ ||
శరభంగోత్తమపద ముచుకుందవరప్రదౌ |
సచ్చిదానందరూపాఢ్యౌ రామకృష్ణౌ గతిర్మమ || ౩౧ ||
ఋక్షవానరసేనాఢ్య వృష్టియాదవసైనికౌ |
పరాత్పరౌ జితామిత్రౌ రామకృష్ణౌ గతిర్మమ || ౩౨ ||
ఋషిసంఘకృతాతిథ్య మునిపత్న్యర్పితోదనౌ |
నిరమయౌ నిరాతంకౌ రామకృష్ణౌ గతిర్మమ || ౩౩ ||
ధరాధరవినిర్భేత్తృ గోవర్ధనధరోద్ధరౌ |
సుబాహు శతధన్వఘ్నౌ రామకృష్ణౌ గతిర్మమ || ౩౪ ||
దశాస్యాన్వయసంహర్తృ దుర్యోధనకులాంతకౌ |
సర్వభూతహితోద్యుక్తౌ రామకృష్ణౌ గతిర్మమ || ౩౫ ||
మృతశాఖామృగోజ్జీవి మృతగోగోపజీవకౌ |
బ్రహ్మేంద్రాదిస్తుతిప్రీతౌ రామకృష్ణౌ గతిర్మమ || ౩౬ ||
శివలింగప్రతిష్ఠాతృ కృతకైలాసయాత్రకౌ |
నిరంజనౌ నిష్కళంకౌ రామకృష్ణౌ గతిర్మమ || ౩౭ ||
మృతద్విజసుతోజ్జీవి వినష్ట గురుపుత్రదౌ |
నిర్మమౌ నిరహంకారౌ రామకృష్ణౌ గతిర్మమ || ౩౮ ||
సరయూ యమునాతీర విహారాసక్తమానసౌ |
వాల్మీకివ్యాససంస్తుత్యౌ రామకృష్ణౌ గతిర్మమ || ౩౯ ||
భూమీశార్చితపాదాబ్జ భూభారపరిహారకౌ |
ధర్మసంస్థాపనోద్యుక్తౌ రామకృష్ణౌ గతిర్మమ || ౪౦ ||
రాజరాజప్రీతికర రాజేంద్రాన్వయపాలకౌ |
సర్వాభీష్టప్రదాతారౌ రామకృష్ణౌ గతిర్మమ || ౪౧ ||
ఇతి శ్రీ రామకృష్ణ అష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.