Site icon Stotra Nidhi

Sri Martanda Stotram – శ్రీ మార్తాండ స్తోత్రం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సూర్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

గాఢాంధకారహరణాయ జగద్ధితాయ
జ్యోతిర్మయాయ పరమేశ్వరలోచనాయ |
మందేహదైత్యభుజగర్వవిభంజనాయ
సూర్యాయ తీవ్రకిరణాయ నమో నమస్తే || ౧ ||

ఛాయాప్రియాయ మణికుండలమండితాయ
సురోత్తమాయ సరసీరుహబాంధవాయ |
సౌవర్ణరత్నమకుటాయ వికర్తనాయ
సూర్యాయ తీవ్రకిరణాయ నమో నమస్తే || ౨ ||

సంజ్ఞావధూహృదయపంకజషట్పదాయ
గౌరీశపంకజభవాచ్యుతవిగ్రహాయ |
లోకేక్షణాయ తపనాయ దివాకరాయ
సూర్యాయ తీవ్రకిరణాయ నమో నమస్తే || ౩ ||

సప్తాశ్వబద్ధశకటాయ గ్రహాధిపాయ
రక్తాంబరాయ శరణాగతవత్సలాయ |
జాంబూనదాంబుజకరాయ దినేశ్వరాయ
సూర్యాయ తీవ్రకిరణాయ నమో నమస్తే || ౪ ||

ఆమ్నాయభారభరణాయ జలప్రదాయ
తోయాపహాయ కరుణామృతసాగరాయ |
నారాయణాయ వివిధామరవందితాయ
సూర్యాయ తీవ్రకిరణాయ నమో నమస్తే || ౫ ||

ఇతి శ్రీ మార్తాండ స్తోత్రమ్ ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ సూర్య స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ సూర్య స్తోత్రాలు చూడండి. మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.


గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments