Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
గిరిచరం కరుణామృతసాగరం
పరిచరం పరమం మృగయాపరమ్ |
సురుచిరం సుచరాచరగోచరం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే || ౧ ||
ప్రణతసంచయచింతిత కల్పకం
ప్రణతమాదిగురుం సురశిల్పకమ్ |
ప్రణవరంజిత మంజులతల్పకం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే || ౨ ||
అరిసరోరుహశంఖగదాధరం
పరిఘముద్గరబాణధనుర్ధరమ్ |
క్షురిక తోమర శక్తిలసత్కరం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే || ౩ ||
విమలమానస సారసభాస్కరం
విపులవేత్రధరం ప్రయశస్కరమ్ |
విమతఖండన చండధనుష్కరం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే || ౪ ||
సకలలోక నమస్కృత పాదుకం
సకృదుపాసక సజ్జనమోదకమ్ |
సుకృతభక్తజనావన దీక్షకం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే || ౫ ||
శరణకీర్తన భక్తపరాయణం
చరణవారిజమాత్మరసాయనమ్ |
వరకరాత్తవిభూతి విభూషణం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే || ౬ ||
మృగమదాంకిత సత్తిలకోజ్జ్వలం
మృగగణాకలితం మృగయాకులమ్ |
మృగవరాసనమద్భుత దర్శనం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే || ౭ ||
గురువరం కరుణామృత లోచనం
నిరుపమం నిఖిలామయమోచనమ్ |
పురుసుఖప్రదమాత్మనిదర్శనం
హరిహరాత్మజమీశ్వరమాశ్రయే || ౮ ||
ఇతి శ్రీ హరిహరాత్మజ ఆశ్రయాష్టకమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ అయ్యప్ప స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ అయ్యప్ప స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.