Site icon Stotra Nidhi

Sri Bhairava Tandava Stotram – శ్రీ భైరవ తాండవ స్తోత్రం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

చండం ప్రతిచండం కరధృతదండం కృతరిపుఖండం సౌఖ్యకరం
లోకం సుఖయంతం విలసితవంతం ప్రకటితదంతం నృత్యకరమ్ |
డమరుధ్వనిశంఖం తరళవసంతం మధురహసంతం లోకభరం
భజ భజ భూతేశం ప్రకటమహేశం భైరవవేషం కష్టహరమ్ || ౧ ||

చర్చితసిందూరం రణభువిశూరం దుష్టవిదూరం శ్రీనికరం
కింకిణిగణరావం త్రిభువనపావం ఖర్పరసావం పుణ్యభరమ్ |
కరుణామయవేషం సకలసురేశం ముక్తసుకేశం పాపహరం
భజ భజ భూతేశం ప్రకటమహేశం భైరవవేషం కష్టహరమ్ || ౨ ||

కలిమలసంహారం మదనవిహారం ఫణిపతిహారం శీఘ్రకరం
కలుషం శమయంతం పరిభృతసంతం మత్తదృగంతం శుద్ధతరమ్ |
గతినిందితకేశం నర్తనదేశం స్వచ్ఛకశం సన్ముండకరం
భజ భజ భూతేశం ప్రకటమహేశం భైరవవేషం కష్టహరమ్ || ౩ ||

కఠినస్తనకుంభం సుకృతసులభం కాళీడింభం ఖడ్గధరం
వృతభూతపిశాచం స్ఫుటమృదువాచం స్నిగ్ధసుకాచం భక్తభరమ్ |
తనుభాజితశేషం విలమసుదేశం కష్టసురేశం ప్రీతినరం
భజ భజ భూతేశం ప్రకటమహేశం భైరవవేషం కష్టహరమ్ || ౪ ||

లలితాననచంద్రం సుమనవితంద్రం బోధితమంద్రం శ్రేష్ఠవరం
సుఖితాఖిలలోకం పరిగతశోకం శుద్ధవిలోకం పుష్టికరమ్ |
వరదాభయహారం తరలితతారం క్షుద్రవిదారం తుష్టికరం
భజ భజ భూతేశం ప్రకటమహేశం భైరవవేషం కష్టహరమ్ || ౫ ||

సకలాయుధభారం విజనవిహారం సుశ్రవిశారం భ్రష్టమలం
శరణాగతపాలం మృగమదభాలం సంజితకాలం స్వేష్టబలమ్ |
పదనూపూరసింజం త్రినయనకంజం గుణిజనరంజన కష్టహరం
భజ భజ భూతేశం ప్రకటమహేశం భైరవవేషం కష్టహరమ్ || ౬ ||

మర్దయితుసరావం ప్రకటితభావం విశ్వసుభావం జ్ఞానపదం
రక్తాంశుకజోషం పరికృతతోషం నాశితదోషం సన్మతిదమ్ |
కుటిలభ్రుకుటీకం జ్వరధననీకం విసరంధీకం ప్రేమభరం
భజ భజ భూతేశం ప్రకటమహేశం భైరవవేషం కష్టహరమ్ || ౭ ||

పరినిర్జితకామం విలసితవామం యోగిజనాభం యోగేశం
బహుమద్యపనాథం గీతసుగాథం కష్టసునాథం వీరేశమ్ |
కలయంతమశేషం భృతజనదేశం నృత్యసురేశం దత్తవరం
భజ భజ భూతేశం ప్రకటమహేశం భైరవవేషం కష్టహరమ్ || ౮ ||

ఇతి శ్రీ భైరవ తాండవ స్తోత్రమ్ ||


గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments