Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
కులశేఖరపాండ్య ఉవాచ –
మహానీపారణ్యాంతర కనకపద్మాకరతటీ
మహేంద్రానీతాష్టద్విపధృతవిమానాంతరగతమ్ |
మహాలీలాభూతప్రకటితవిశిష్టాత్మవిభవం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || ౧ ||
నమన్నాళీకాక్షాంబుజ భవసునాశీర మకుటీ
వమన్మాణిక్యాంశుస్ఫురదరుణపాదాబ్జయుగళమ్ |
అమందానందాబ్ధిం హరినయనపద్మార్చితపదం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || ౨ ||
మహామాతంగాసృగ్వరవసనమదీంద్రతనయా
మహాభాగ్యం మత్తాంధకకరటికంఠీరవవరమ్ |
మహాభోగీంద్రోద్యత్ఫణగణిగణాలంకృతతనుం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || ౩ ||
సమీరాహారేంద్రాంగదమఖిలలోకైకజననం
సమీరాహారాత్మా ప్రణతజనహృత్పద్మనిలయమ్ |
సుమీనాక్షీ వక్త్రాంబుజ తరుణసూరం సుమనసం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || ౪ ||
నతాఘౌఘారణ్యానలమనిలభుఙ్నాథవలయం
సుధాంశోరర్ధాంశం శిరసి దధతం జహ్నుతనయామ్ |
వదాన్యానామాద్యం వరవిబుధవంద్యం వరగుణం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || ౫ ||
మహాదుగ్ధాంబోధౌమథనజవసంభూతమసితం
మహాకాళం కంఠే సకలభయభంగాయ దధతమ్ |
మహాకారుణ్యాబ్ధిం మధుమథన దృగ్దూరచరణం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || ౬ ||
దశాస్యాహంకార ద్రుమ కులిశితాంగుష్ఠనఖరం
నిశానాథ శ్రీజిన్నిజవదనబింబం నిరవధిమ్ |
విశాలాక్షం విశ్వప్రభవ భరణోపాయకరణం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || ౭ ||
అనాకారంహారికృతభుజగరాజం పురహరం
సనాథం శర్వాణ్యా సరసిరుహపత్రాయతదృశమ్ |
దినారంభాదిత్యాయుతశతనిభానందవపుషం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || ౮ ||
ఉమాపీనోత్తుంగ స్తనతటల సత్కుంకుమరజ-
స్సమాహారాత్యంతారుణవిపులదోరంతరతలమ్ |
రమా వాణీంద్రాణీరతివిరచితారాధనవిధిం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || ౯ ||
ధరాపాథస్స్వాహాసహచర జగత్ప్రాణశశభృ-
త్సురాధ్వాహర్నాదాధ్వర కరశరీరం శశిధరమ్ |
సురాహారాస్వాదాతిశయ నిజవాచం సుఖకరం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || ౧౦ ||
ధరాపీఠం ధారాధరకలశమాకాశవపుషం
ధరాభృద్దోద్దండం తపన శశి వైశ్వానరదృశమ్ |
విరాజన్నక్షత్ర ప్రసవముదరీభూత జలధిం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || ౧౧ ||
సుపర్ణాంకాంభోజాసన దృగతి దూరాంఘ్రిమకుటం
సువర్ణాహార స్రక్సురవిటపిశాఖాయుతభుజమ్ |
అపర్ణాపాదాబ్జాహతి చలిత చంద్రార్థిత జటం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || ౧౨ ||
మఖారాతిం మందస్మిత మధురబింబాధర లస-
న్ముఖాంభోజం ముగ్ధామృతకిరణచూడామణిధరమ్ |
నఖాకృష్టేభత్వక్పరివృత శరీరం పశుపతిం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || ౧౩ ||
సహస్రాబ్జైకోనే నిజనయనముద్ధృత్య జయతే
సహస్రాఖ్యాపూర్త్యై సరసిజదృశే యేన కృపయా |
సహస్రారం దత్తం తపన నియుతాభం రథపదం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || ౧౪ ||
రథావన్యామ్నాయాశ్వమజరథకారం రణపటుం
రథాంగాదిత్యేందుం రథపద ధరాస్త్రం రథివరమ్ |
రథాధారేష్వాసం రథధర గుణం రమ్యఫలదం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || ౧౫ ||
ధరాకర్షాపాస్త ప్రచుర భుజకండూయన జలం
ధరాహార్యద్వైధీ కరణహృతలోకత్రయభయమ్ |
స్మరాకారాహారావృతచటుల పాలానలకణం
మహాదేవం వందే మధురశఫరాక్షీసహచరమ్ || ౧౬ ||
సోమసుందరనాథస్య స్తోత్రం భక్త్యా పఠంతి యే |
శ్రియాపరమయా యుక్తాశ్శివమంతే భజంతి తే || ౧౭ ||
ఇతి శ్రీహాలాస్యమహాత్మ్యే కులశేఖరపాండ్యకృతా శ్రీశివస్తుతిః |
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.