Site icon Stotra Nidhi

Brahma Kruta Pitru Stotram (Telugu Meaning) – పితృ స్తోత్రం – ౩ (బ్రహ్మ కృతం)

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

(బృహద్ధర్మ పురాణం నుండి బ్రహ్మదేవుడు స్వయంగా ఉపదేశించిన ఈ స్తోత్రం పితృదేవతల పట్ల కృతజ్ఞతను చాటే గొప్ప సాధనం.)

బ్రహ్మోవాచ |
నమః పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ |
సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే || ౧ ||

నాకు జన్మనిచ్చిన తండ్రికి (జన్మదాత్రే) నమస్కారము. ఆయన సర్వ దేవతా స్వరూపుడు (సర్వదేవమయాయ). సుఖాన్ని ఇచ్చేవాడు, ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు, అత్యంత ప్రియమైనవాడు మరియు గొప్ప ఆత్మ కలిగిన ఆ మహాత్మునికి (తండ్రికి) వందనము.

సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే |
సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ || ౨ ||

తండ్రి సమస్త యజ్ఞాల స్వరూపము (సర్వయజ్ఞస్వరూపాయ). ఆయనే నాకు స్వర్గము, ఆయనే పరమశ్రేష్ఠుడు. సమస్త పుణ్యతీర్థముల సారము ఆయనలోనే ఉన్నది. ఆయన అపారమైన కరుణ కలిగిన సముద్రము వంటివాడు.

నమః సదాఽఽశుతోషాయ శివరూపాయ తే నమః |
సదాఽపరాధక్షమిణే సుఖాయ సుఖదాయ చ || ౩ ||

కొంచెం సేవ చేస్తేనే త్వరగా సంతోషించే (ఆశుతోష) శివుని రూపము నీది. నా అపరాధములను ఎల్లప్పుడూ క్షమించే ఓ తండ్రీ! నీకు నమస్కారము. నీవు సుఖ స్వరూపుడవు మరియు సుఖాన్ని ప్రసాదించేవాడవు.

దుర్లభం మానుషమిదం యేన లబ్ధం మయా వపుః |
సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః || ౪ ||

పొందుటకు అత్యంత కష్టమైన ఈ మానవ దేహాన్ని (మానుషం వపుః) నేను ఎవరి వల్లనైతే పొందానో, ధర్మాచరణ కోసం నన్ను ఎవరైతే సిద్ధం చేశారో, అట్టి నా తండ్రికి తిరిగి తిరిగి నమస్కారములు.

తీర్థస్నానతపోహోమజపాదీన్ యస్య దర్శనమ్ |
మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః || ౫ ||

ఎవరిని దర్శిస్తే సమస్త తీర్థస్నానములు, తపస్సు, హోమము మరియు జపము చేసిన ఫలితం కలుగుతుందో… గురువులకే గురువైన (మహాగురోశ్చ గురవే) ఆ తండ్రికి నమస్కారము.

యస్య ప్రణామ స్తవనాత్ కోటిశః పితృతర్పణమ్ |
అశ్వమేధశతైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః || ౬ ||

ఎవరికి నమస్కరించడం వల్ల, ఎవరిని స్తుతించడం వల్ల కోట్లాది పితృతర్పణములు చేసిన పుణ్యం కలుగుతుందో, వంద అశ్వమేధ యాగాల ఫలితం లభిస్తుందో.. అట్టి నా తండ్రికి నమస్కారము.

ఇదం స్తోత్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః |
ప్రత్యహం ప్రాతరుత్థాయ పితృశ్రాద్ధదినేఽపి చ || ౭ ||

స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోఽపి వా |
న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితమ్ || ౮ ||

అత్యంత పుణ్యప్రదమైన ఈ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే, పితృకార్యాల (శ్రాద్ధము) రోజున, లేదా తన పుట్టినరోజున తండ్రి ఎదుట నిలబడి పఠిస్తారో… వారికి ఈ లోకంలో లభించనిది అంటూ ఏదీ ఉండదు. సర్వజ్ఞత్వంతో సహా వారు కోరుకున్నవన్నీ సిద్ధించును.

నానాపకర్మ కృత్వాఽపి యః స్తౌతి పితరం సుతః |
స ధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీ భవేత్ |
పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యథార్హతి || ౯ ||

ఒకవేళ కుమారుడు తెలియక ఏవైనా పొరపాట్లు (అపకర్మలు) చేసినా, ఈ స్తోత్రంతో తండ్రిని స్తుతిస్తే.. అది గొప్ప ప్రాయశ్చిత్తముగా మారి అతడు సుఖాన్ని పొందుతాడు. తండ్రి ప్రీతిని పొందినవాడు మాత్రమే అన్ని పనులకు (కర్మలకు) అర్హుడవుతాడు.

ఇతి బృహద్ధర్మపురాణాంతర్గత బ్రహ్మకృత పితృ స్తోత్రం |


మరిన్ని పితృదేవత స్తోత్రాలు చూడండి.

మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments