Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
యద్ధితం తవ భక్తానామస్మాకం నృహరే హరే |
తదాశు కార్యం కార్యజ్ఞ ప్రళయార్కాయుతప్రభ || ౧ ||
రటత్సటోగ్ర భ్రుకుటీకఠోరకుటిలేక్షణ |
నృపంచాస్య జ్వలజ్జ్వాలోజ్జ్వలాస్యారీన్ హరే హర || ౨ ||
ఉన్నద్ధకర్ణవిన్యాస వివృతానన భీషణ |
గతదూషణ మే శత్రూన్ హరే నరహరే హర || ౩ ||
హరే శిఖిశిఖోద్భాస్వదురః క్రూరనఖోత్కర |
అరీన్ సంహర దంష్ట్రోగ్రస్ఫురజ్జిహ్వ నృసింహ మే || ౪ ||
జఠరస్థ జగజ్జాల కరకోట్యుద్యతాయుధ |
కటికల్పతటిత్కల్పవసనారీన్ హరే హర || ౫ ||
రక్షోధ్యక్షబృహద్వక్షోరూక్షకుక్షివిదారణ |
నరహర్యక్ష మే శత్రుపక్షకక్షం హరే దహ || ౬ ||
విధిమారుతశర్వేంద్రపూర్వగీర్వాణపుంగవైః |
సదా నతాంఘ్రిద్వంద్వారీన్ నరసింహ హరే హర || ౭ ||
భయంకరోర్వలంకార వరహుంకారగర్జిత |
హరే నరహరే శత్రూన్ మమ సంహర సంహర || ౮ ||
వాదిరాజయతిప్రోక్తం నరహర్యష్టకం నవమ్ |
పఠన్నృసింహకృపయా రిపూన్ సంహరతి క్షణాత్ || ౯ ||
ఇతి శ్రీమద్వాదిరాజ పూజ్యచరణ విరచితం శ్రీ నరహర్యష్టకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ నరసింహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.