Site icon Stotra Nidhi

Sri Meenakshi Navaratnamala – శ్రీ మీనాక్షీ నవరత్నమాలా

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

గౌరీం కాంచనపద్మినీతటగృహాం శ్రీసుందరేశప్రియాం
నీపారణ్యసువర్ణకంతుకపరిక్రీడావిలోలాముమాం |
శ్రీమత్పాండ్య కులాచలాగ్రవిలసద్రత్నప్రదీపాయితాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || ౧ ||

గౌరీం వేదకదంబకాననశుకీం శాస్త్రాటవీకేకినీం
వేదాంతాఖిలధర్మహేమనళినీహంసీం శివాం శాంభవీం |
ఓంకారాబుజనీలమత్తమధుపాం మంత్రామ్రశాఖాపికాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || ౨ ||

గౌరీం నూపురశోభితాంఘ్రికమలాం తూణోల్లసజ్జంఘికాం
దంతాదర్శసమానజానుయుగళాం రంభానిభోరూజ్జ్వలాం |
కాంచీబద్ధమనోజ్ఞపీన జఘనామావర్తనాభీహృదాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || ౩ ||

గౌరీం వ్యోమసమానమధ్యమధృతాముత్తుంగవక్షోరుహాం
వీణామంజుళశారికాన్వితకరాం శంఖాభకంఠోజ్జ్వలాం |
రాకాచంద్రసమానచారువదనాం లోలంబనీలాలకాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || ౪ ||

గౌరీం కుంకుమపంకలేపితలసద్వక్షోజకుంభోజ్జ్వలాం
కస్తూరీతిలకాళికామలయజోల్లేపోల్లసత్కంధరాం |
లాక్షాకర్దమ శోభిపాదయుగళాం సిందూరసీమంతినీం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || ౫ ||

గౌరీం మంజుళమీననేత్రయుగళాం కోదండసుభ్రూలతాం
బింబోష్ఠీం జితకుందదంతరుచిరాం చాంపేయనాసోజ్జ్వలాం |
అర్ధేందుప్రతిబింబఫాలరుచిరామాదర్శగండస్థలాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || ౬ ||

గౌరీం కాంచనకంకణాంగదధరాం నాసోల్లసన్మౌక్తికాం
కాంచీహారకిరీటకుండలశిరోమాణిక్యభూషోజ్జ్వలాం |
మంజీరాంగుళిముద్రికాంఘ్రికటకగ్రైవేయకాలంకృతాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || ౭ ||

గౌరీం చంపకమల్లికాదికుసుమాం పున్నాగసౌగంధికాం
ద్రోణేందీవరకుందజాతివకుళైరాబద్ధచూళీయుతాం |
మందారారుణపుష్పకైతకదళైః శ్రేణీలసద్వేణికాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || ౮ ||

గౌరీం దాడిమపుష్పవర్ణవిలసద్దివ్యాంబరాలంకృతాం
చంద్రాంశోపమచారుచామరకరాం శ్రీభారతీసేవితాం |
నానారత్నసువర్ణదండవిలసన్ముక్తాతపత్రోజ్జ్వలాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || ౯ ||

వాచా వా మనసాపి వా గిరిసుతే కాయేన వా సంతతం
మీనాక్షీతి కదాచిదంబ కురుతేత్వన్నామసంకీర్తనం |
లక్ష్మీః తస్య గృహే వసత్యనుదినం వాణీ చ వక్త్రాంబుజే
ధర్మాద్యష్టచతుష్టయం కరతలే ప్రాప్తం భవేన్నిశ్చయః || ౧౦ ||


మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.


స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments