Site icon Stotra Nidhi

Kanti Sukravaramu – కంటి శుక్రవారము

 

Read in తెలుగు / English (IAST)

కంటి శుక్రవారము గడియలేడింట |
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని ||

సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు |
చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి
తుమ్మెద మై ఛాయతోన నెమ్మదినుండే స్వామిని ||

పచ్చకప్పురమె నూరి పసిడి గిన్నెలనించి
తెచ్చి శిరసాదిగ దిగనలది |
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై
నిచ్చమల్లెపూవువలె నిటుతానుండే స్వామిని ||

తట్టుపునుగే కూరిచి చట్టలు చేరిచినిప్పు
పట్టి కరగించి వెండి పళ్యాలనించి |
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని ||


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments