Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
ముదా కరాత్తమోదకం సదా విముక్తిసాధకం
కళాధరావతంసకం విలాసిలోకరక్షకమ్ |
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం
నతాశుభాశునాశకం నమామి తం వినాయకమ్ || ౧ ||
నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం
నమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరమ్ |
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ || ౨ ||
సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం
దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరమ్ |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ || ౩ ||
అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం
పురారిపూర్వనందనం సురారిగర్వచర్వణమ్ |
ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం
కపోలదానవారణం భజే పురాణవారణమ్ || ౪ ||
నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం
అచింత్యరూపమంతహీనమంతరాయకృంతనమ్ |
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ || ౫ ||
మహాగణేశపంచరత్నమాదరేణ యోఽన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్గణేశ్వరమ్ |
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోఽచిరాత్ || ౬ ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృత శ్రీగణేశ పంచరత్నమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.