Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
చాంచల్యారుణలోచనాంచితకృపాం చంద్రార్కచూడామణిం
చారుస్మేరముఖాం చరాచరజగత్సంరక్షణీం తత్పదామ్ |
చంచచ్చంపకనాసికాగ్రవిలసన్ముక్తామణీరంజితాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౧ ||
కస్తూరీతిలకాంచితేందువిలసత్ప్రోద్భాసిఫాలస్థలీం
కర్పూరద్రవమిశ్రచూర్ణఖదిరామోదోల్లసద్వీటికామ్ |
లోలాపాంగతరంగితైరధికృపాసారైర్నతానందినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౨ ||
రాజన్మత్తమరాలమందగమనాం రాజీవపత్రేక్షణాం
రాజీవప్రభవాదిదేవమకుటై రాజత్పదాంభోరుహామ్ |
రాజీవాయతమందమండితకుచాం రాజాధిరాజేశ్వరీం [పత్ర]
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౩ ||
షట్తారాం గణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం
షట్చక్రాంతరసంస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితామ్ |
షట్చక్రాంచితపాదుకాంచితపదాం షడ్భావగాం షోడశీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౪ ||
శ్రీనాథాదృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం
జ్ఞానాసక్తమనోజయౌవనలసద్గంధర్వకన్యాదృతామ్ | [గానా]
దీనానామాతివేలభాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౫ ||
లావణ్యాధికభూషితాంగలతికాం లాక్షాలసద్రాగిణీం
సేవాయాతసమస్తదేవవనితాం సీమంతభూషాన్వితామ్ |
భావోల్లాసవశీకృతప్రియతమాం భండాసురచ్ఛేదినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౬ ||
ధన్యాం సోమవిభావనీయచరితాం ధారాధరశ్యామలాం
మున్యారాధనమోదినీం సుమనసాం ముక్తిప్రదానవ్రతామ్ |
కన్యాపూజనసుప్రసన్నహృదయాం కాంచీలసన్మధ్యమాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౭ ||
కర్పూరాగరుకుంకుమాంకితకుచాం కర్పూరవర్ణస్థితాం
కృష్టోత్కృష్టసుకృష్టకర్మదహనాం కామేశ్వరీం కామినీమ్ |
కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పాంతరస్థాయినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౮ ||
గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వగానప్రియాం
గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతామ్ |
గంగాగౌతమగర్గసన్నుతపదాం గాం గౌతమీం గోమతీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే || ౯ ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీ భ్రమరాంబాష్టకం సంపూర్ణమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దుర్గా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.