Site icon Stotra Nidhi

Sri Rudra Stavanam – శ్రీ రుద్ర స్తవనం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

నమో విరించవిష్ణ్వీశభేదేన పరమాత్మనే |
సర్గసంస్థితిసంహారవ్యావృత్తివ్యక్తవృత్తయే || ౧ ||

నమశ్చతుర్ధా ప్రోద్భూతభూతభూతాత్మనే భువః |
భూరిభారార్తిసంహర్త్రే భూతనాథాయ శూలినే || ౨ ||

విశ్వగ్రాసాయ విలసత్కాలకూటవిషాశినే |
తత్కళంకాంకితగ్రీవనీలకంఠాయ తే నమః || ౩ ||

నమో లలాటనయనప్రోల్లసత్కృష్ణవర్త్మనే |
ధ్వస్తస్మరనిరస్తాధియోగిధ్యాతాయ శంభవే || ౪ ||

నమో దేహార్ధకాంతాయ దగ్ధదక్షాధ్వరాయ చ |
చతుర్వర్గేష్వభీష్టార్థదాయినే మాయినేఽణవే || ౫ ||

స్థూలాయ మూలభూతాయ శూలదారితవిద్విషే |
కాలహంత్రే నమశ్చంద్రఖండమండితమౌళయే || ౬ ||

వివాససే కపర్దాంతర్భ్రాంతాహిసరిదిందవే |
దేవదైత్యాసురేంద్రాణాం మౌళిఘృష్టాంఘ్రయే నమః || ౭ ||

భస్మాభ్యక్తాయ భక్తానాం భుక్తిముక్తిప్రదాయినే |
వ్యక్తావ్యక్తస్వరూపాయ శంకరాయ నమో నమః || ౮ ||

నమోఽంధకాంతకరిపవే పురద్విషే
నమోఽస్తు తే ద్విరదవరాహభేదినే |
విషోల్లసత్ఫణికులబద్ధమూర్తయే
నమః సదా వృషవరవాహనాయ తే || ౯ ||

వియన్మరుద్ధుతవహవార్వసుంధరా
మఖేశరవ్యమృతమయూఖమూర్తయే |
నమః సదా నరకభయావభేదినే
భవేహ నో భవభయభంగకృద్విభో || ౧౦ ||

ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ ప్రపంచసారే పంచవింశః పటలే శ్రీ రుద్ర స్తవనమ్ |


గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments