Site icon Stotra Nidhi

Sri Gananatha Stotram – శ్రీ గణనాథ స్తోత్రం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

గర్భ ఉవాచ |
నమస్తే గణనాథాయ బ్రహ్మణే బ్రహ్మరూపిణే |
అనాథానాం ప్రణాథాయ విఘ్నేశాయ నమో నమః || ౧ ||

జ్యేష్ఠరాజాయ దేవాయ దేవదేవేశమూర్తయే |
అనాదయే పరేశాయ చాదిపూజ్యాయ తే నమః || ౨ ||

సర్వపూజ్యాయ సర్వేషాం సర్వరూపాయ తే నమః |
సర్వాదయే పరబ్రహ్మన్ సర్వేశాయ నమో నమః || ౩ ||

గజాకారస్వరూపాయ గజాకారమయాయ తే |
గజమస్తకధారాయ గజేశాయ నమో నమః || ౪ ||

ఆదిమధ్యాంతభావాయ స్వానందపతయే నమః |
ఆదిమధ్యాంతహీనాయ త్వాదిమధ్యాంతగాయ తే || ౫ ||

సిద్ధిబుద్ధిప్రదాత్రే చ సిద్ధిబుద్ధివిహారిణే |
సిద్ధిబుద్ధిమయాయైవ బ్రహ్మేశాయ నమో నమః || ౬ ||

శివాయ శక్తయే చైవ విష్ణవే భానురూపిణే |
మాయినాం మాయయా నాథ మోహదాయ నమో నమః || ౭ ||

కిం స్తౌమి త్వాం గణాధీశ యత్ర వేదాదయోఽపరే |
యోగినః శాంతిమాపన్నా అతస్త్వాం ప్రణమామ్యహమ్ || ౮ ||

రక్ష మాం గర్భదుఃఖాత్త్వం త్వామేవ శరణాగతమ్ |
జన్మమృత్యువిహీనం వై కురుష్వ తే పదప్రియమ్ || ౯ ||

ఇతి శ్రీమన్ముద్గలే మహాపురాణే నవమ ఖండే శ్రీ గణనాథ స్తోత్రమ్ ||


మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments