Site icon Stotra Nidhi

Sri Dakshinamurthy Panjaram – శ్రీ దక్షిణామూర్తి పంజరం

 

Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)

ప్రణమ్య సాంబమీశానాం శిరసా వైణికో మునిః |
వినయాఽవనతో భూత్వా పప్రచ్ఛ స్కందమాదరాత్ || ౧ ||

నారద ఉవాచ |
భగవన్ పరమేశాన సంప్రాప్తాఖిలశాస్త్రక |
స్కందసేనాపతే స్వామిన్ పార్వతీప్రియనందన || ౨ ||

యజ్జపాత్ కవితా విద్యా శివే భక్తిశ్చ శాశ్వతీ |
అవాప్తిరణిమాదీనాం సంపదాం ప్రాప్తిరేవ చ || ౩ ||

భూతప్రేతపిశాచానామగమ్యత్వమరోగతా |
మహావిజ్ఞానసంప్రాప్తిర్మహారాజవిపూజనమ్ || ౪ ||

వరప్రసాదో దేవానాం మహాభోగార్థసంభవః |
నష్టరాజ్యశ్చ సిద్ధిశ్చ తథా నిగళమోచనమ్ || ౫ ||

ఋణదారిద్ర్యనాశశ్చ తనయప్రాప్తిరేవ చ |
అశ్రుతస్య ప్రబంధస్య సమ్యగ్వ్యాఖ్యానపాటవమ్ || ౬ ||

ప్రతిభోన్మేషణం చైవ ప్రబంధరచనా తథా |
భవంత్యచిరకాలేన తద్ర్బూహి హర సుప్రజః || ౭ ||

స్కంద ఉవాచ |
సాధు పృష్టం మహాభాగ కమలాసనసత్సుత |
త్వయైన పృష్టమేతద్ధి జగతాముపకారకమ్ || ౮ ||

బాల ఏవ పురా సోఽహం స్వపనం ప్రాప్తవాన్ యదా |
తదా మే నికటం ప్రాప్య దక్షిణామూర్తిరూపధృత్ || ౯ ||

పితా మే పంజరం స్వస్య సర్వవిజ్ఞానదాయకమ్ |
ఉపాదిశదహం తేన విజ్ఞానమగమం ధృవమ్ || ౧౦ ||

దేవసేనాపతి త్వం చ తారకస్య జయం తథా |
విద్యామయోఽహం భగవన్ తజ్జపాన్మునిసత్తమ || ౧౧ ||

సదా తస్య జపం కుర్యాదాత్మనః క్షేమకృద్యది |
ఇతః పూర్వం న కస్యాపి మయా నోక్తం యతవ్రత || ౧౨ ||

ఉపదేశం తవైవాద్య కరవాణి శుభాప్తయే |
త్వన్ముఖాదేవ లోకేషు ప్రసిద్ధం చ గమిష్యతి || ౧౩ ||

ఋషిస్తస్య శుకః ప్రోక్తశ్ఛంధోఽనుష్టుబుదాహృతమ్ |
దేవతా దక్షిణామూర్తిః ప్రణవో బీజమిష్యతే || ౧౪ ||

స్వాహా శక్తిః సముచ్చార్య నమః కీలకముచ్యతే |
వర్ణః శుక్లః సమాఖ్యాతో వాంఛితార్థే నియుజ్యతే || ౧౫ ||

తతః సాంబం శివం ధ్యాయేద్దక్షిణామూర్తిమవ్యయమ్ |
ఛాయాపిహితవిశ్వస్య మూలే న్యగ్రోధశాఖినః || ౧౬ ||

మణిసింహాసనాసీనం మునిబృందనిషేవితమ్ |
వరభూషణదీప్తాంగం మాణిక్యమకుటోజ్జ్వలమ్ || ౧౭ ||

మందాకినీజలస్పర్ధి ప్రభాభాసితవిగ్రహమ్ |
శుక్లవస్త్రపరీధానం శుక్లమాల్యానులేపనమ్ || ౧౮ ||

స్ఫాటికీమక్షమాలాం చ వహ్నీం చ భుజగాధిపమ్ |
పుస్తకం చ కరైర్దివ్యైర్దధానం చంద్రశేఖరమ్ || ౧౯ ||

మంజుమంజీరనినదైరాకృష్టాఖిలసారసమ్ |
కేయూరకోటివిలసద్వరమాణిక్యదీప్తిభిః || ౨౦ ||

తేజితాశేషభువనం తేజసామేకసంశ్రయమ్ |
జాహ్నవీసలిలోన్మగ్న జటామండలమండితమ్ || ౨౧ ||

ఉత్ఫుల్లకమలోదారచక్షుషం కరుణానిధిమ్ |
భుజంగశిశు విత్రస్త కురంగశిశుమండితమ్ || ౨౨ ||

అగ్రేంద్రతనయాసక్తవరాంగమతులప్రభమ్ |
పాదశుశ్రూషణాసక్త నాకనారీసమావృతమ్ || ౨౩ ||

కైలాసశృంగసంకాశ మహోక్షవరవాహనమ్ |
బ్రహ్మాదిభిరభిధ్యేయం బ్రహ్మణ్యం బ్రహ్మనిష్ఠితమ్ || ౨౪ ||

ప్రాచీనానామపి గిరామగోచరమనామయమ్ |
ధ్యాయన్నేవం మహాదేవం ప్రజపేత్పంజరం శుభమ్ || ౨౫ ||

అస్య శ్రీదక్షిణామూర్తి పంజర మహామంత్రస్య శ్రీ శుక ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీదక్షిణామూర్తిర్దేవతా ఓం బీజం స్వాహా శక్తిః నమః కీలకం శ్రీ దక్షిణామూర్తి ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |

ఆం ఈం ఊం ఐం ఔం అః ఇతి న్యాసః ||

ధ్యానమ్ –
వటమూలనివాసబద్ధతృష్ణం
మునినికరాయ వివేకమాదిశంతం |
పశుపతిమగరాజకన్యకాయై
స్మరహృదయాశు వికీర్ణ వామభాగమ్ ||

వీరాసనైకనిలయాయ హిరణ్మయాయ
న్యగ్రోధమూలగృహిణే నిటలేక్షణాయ |
గంగాధరాయ గజచర్మవిభూషణాయ
ప్రాచీనపుణ్యపురుషాయ నమః శివాయ ||

ముద్రా పుస్తక వహ్ని నాగవిలసద్బాహుం ప్రసన్నాసనం
ముక్తాహారవిభూషితం శశికళాభాస్వత్కిరీటోజ్జ్వలమ్ |
అజ్ఞానాపహమాదిమాదిమగిరామర్థం భవానీపతిం
న్యగ్రోధాత్తనివాసినం పరగురుం ధ్యాయేదభీష్టాప్తయే ||

శిరో మే దక్షిణామూర్తిః పాతు పాశవిమోచకః |
ఫాలం పాతు మహాదేవః పాతు మే విశ్వదృగ్దృశౌ || ౧ ||

శ్రవణే పాతు విశ్వాత్మా పాతు గండస్థలం హరః |
శివో మే నాసికాం పాతు తాల్వోష్ఠౌ పార్వతీపతిః || ౨ ||

జిహ్వాం మే పాతు విద్యాత్మా దంతాన్ పాతు వృషధ్వజః |
చుబుకం పాతు సర్వాత్మా శ్రీకంఠః కంఠమేవతు || ౩ ||

స్కంధౌ పాతు వృషస్కంధః శూలపాణిః కరౌ మమ |
సర్వజ్ఞో హృదయం పాతు స్తనౌ పాతు గజాంతకః || ౪ ||

వక్షో మృత్యుంజయః పాతు కుక్షిం కుక్షిస్థవిష్టపః |
శర్వో వళిత్రయం పాతు పాతు నాభిం గిరీశ్వరః || ౫ ||

వ్యోమకేశః కటిం పాతు గుహ్యం పాతు పురాంతకః |
ఊరూ పాతు మఘధ్వంసీ జానునీ పాతు శంకరః || ౬ ||

జంఘే పాతు జగత్ స్రష్టా గుల్ఫౌ పాతు జగద్గురుః |
అపస్మారౌపమర్దీ మే పాదౌ పాతు మహేశ్వరః || ౭ ||

రోమాణి వ్యోమకేశో మే పాతు మాంసం పినాకధృత్ |
దారాన్ పాతు విరూపాక్షః పుత్రాన్ పాతు జటాధరః || ౮ ||

పశూన్ పశుపతిః పాతు భ్రాతౄన్ భూతేశ్వరో మమ |
రక్షాహీనం తు యత్ స్థానం సర్వతః పాతు శంకరః || ౯ ||

ఇతీదం పంజరం యస్తు పఠేన్నిత్యం సమాహితః |
గద్యపద్యాత్మికా వాణీ ముఖాన్నిస్సరతి ధ్రువమ్ || ౧౦ ||

వ్యాచష్టే హ్యశ్రుతం శాస్త్రం తనుతే కావ్యనాటకమ్ |
శాస్త్రషట్కం చతుర్వేదాః సమయాః షట్తథైవ చ || ౧౧ ||

స్వయమేవ ప్రకాశం తే నాత్ర కార్యా విచారణా |
తస్య గేహే మహాలక్ష్మీః సన్నిధత్తే సదాఽనఘ || ౧౨ ||

తస్య కాత్యాయనీ దేవీ ప్రసన్నా వరదా భవేత్ |
ఆధయో వ్యాధయశ్చాపి న భవంతి కదాచన || ౧౩ ||

స చ నాశయతే నిత్యం కాలమృత్యుమపి ధ్రువమ్ |
జపేదవశ్యం విద్యార్థీ గ్రహణే చంద్రసూర్యయోః || ౧౪ ||

దక్షిణామూర్తిదేవస్య ప్రాసాదాత్ పండితో భవేత్ |
భక్తిశ్రద్ధే పురస్కృత్య దక్షిణామూర్తిపంజరమ్ || ౧౫ ||

జపిత్వా కవితాం విద్యాం ప్రాప్నుయాత్ సర్వమాప్నుయాత్ |
జలమధ్యే స్థిరో భూత్వా జపిత్వా పంజరోత్తమమ్ || ౧౬ ||

భూతప్రేతపిశాచాదీన్నాశయేన్నాత్ర సంశయః |
మహాపాతకయుక్తో వా యుక్తో వా సర్వపాతకైః || ౧౭ ||

ముచ్యతే బ్రహ్మహత్యాయా అపి నారదసత్తమ |
త్రిసంధ్యం పంజరమిదమావర్తయతి యః పుమాన్ || ౧౮ ||

కిం న సిద్ధ్యతి తస్యాత్ర సుకృతం మునిసత్తమ |
తేనేష్టం రాజసూయేన కృతం దానాదికేన చ || ౧౯ ||

పుంశబ్దవాచ్యః స పుమాన్ పుణ్యానాం భాజనం స చ |
రోగముక్తః స ఏవ స్యాదతులాం కీర్తిమాప్నుయాత్ || ౨౦ ||

పుత్రాః కులకరాస్తస్య సంపద్యంతే న సంశయః |
ఆప్నుయాదఖిలం రాజ్యం తథా బంధవిమోచనమ్ || ౨౧ ||

పూజ్యతే పార్థివస్థానే తస్య వశ్యా వరాంగనాః |
బంధూనాం రక్షణే భూయాత్ సమానేషూత్తమో భవేత్ || ౨౨ ||

ఇహ భుక్త్వాఽఖిలాన్ భోగాన్ తథైవాముష్మికానపి |
కైలాసే సుచిరం స్థిత్వా దక్షిణామూర్తిసన్నిధౌ || ౨౩ ||

తస్మాదవాప్య విజ్ఞానం ప్రాప్య రుద్రత్వమేవ చ |
విలయం యాతి తత్త్వార్థీ నాత్ర కార్యా విచారణా || ౨౪ ||

తస్మాత్ సర్వప్రయత్నేన మోక్షార్థీ సర్వదా పుమాన్ |
ఇదమావర్తయేన్నిత్యం దక్షిణామూర్తి పంజరమ్ |
సర్వపాపవిశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్ || ౨౫ ||

ఇతి గుహనారదసంవాదే శ్రీ దక్షిణామూర్తి పంజరమ్ ||


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాలు చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments