Sri Vishwanatha Ashtakam – శ్రీ విశ్వనాథాష్టకం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

గంగాతరంగరమణీయజటాకలాపం
గౌరీనిరంతరవిభూషితవామభాగమ్ |
నారాయణప్రియమనంగమదాపహారం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౧ ||

అర్థం – గంగ యొక్క అలలచే రమణీయముగా చుట్టబడిన జటాజూటము కలిగి, ఎడమవైపు ఎల్లపుడు గౌరీదేవి వలన అలంకరింపబడి, నారాయణునకు ఇష్టమైన వాడు, అనంగుని (కామదేవుని) మదమును అణిచివేసినవాడు, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.

వాచామగోచరమనేకగుణస్వరూపం
వాగీశవిష్ణుసురసేవితపాదపీఠమ్ | [పద్మమ్]
వామేన విగ్రహవరేణ కలత్రవంతం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౨ ||

అర్థం – మాటలతో చెప్పడానికి సాధ్యం కాని చాలా గుణములయొక్క స్వరూపము కలిగి, వాగీశ (బ్రహ్మ), విష్ణు మరియు సురులచే సేవింపబడు పాదములను కలిగి, ఎడమవైపు మూర్తీభవించిన భార్యను కలిగి, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.

భూతాధిపం భుజగభూషణభూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్ |
పాశాంకుశాభయవరప్రదశూలపాణిం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౩ ||

అర్థం – భూతములకు రాజుగా, సర్పములను శరీర ఆభరణములుగాచేసికొని, పులిచర్మముమును వస్త్రముగా కట్టుకుని, జటాజూటమును, మూడుకన్నులను కలిగి, పాశమును (త్రాడు), అంకుశమును (గాలము), భయములేనిది, వరములను ఇవ్వగలిగినది అయిన శూలమును చేతితో పట్టుకొనియున్న, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.

శీతాంశుశోభితకిరీటవిరాజమానం
భాలేక్షణానలవిశోషితపంచబాణమ్ |
నాగాధిపారచితభాసురకర్ణపూరం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౪ ||

అర్థం – చల్లని తేజస్సుతో ఉన్న చంద్రుడిని కిరీటముగా చేసుకొని, నుదుటి కంటి మంటలో అయిదు బాణములను విలీనము చేసుకొని, సర్పములయొక్క రాజుని చెవికి ఆభరణముగా చేసుకొని, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.

పంచాననం దురితమత్తమతంగజానాం
నాగాంతకం దనుజపుంగవపన్నగానామ్ |
దావానలం మరణశోకజరాటవీనాం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౫ ||

అర్థం – పాపములచే మదమెక్కిన ఏనుగులకు సింహమువంటి వాడు, పాము వంటి దైత్యులకు నాగాంతకుడు, మృత్యువు, బాధ మరియు ముసలితనము అను అడవికి కార్చిచ్చు, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.

తేజోమయం సగుణనిర్గుణమద్వితీయం
ఆనందకందమపరాజితమప్రమేయమ్ |
నాగాత్మకం సకళనిష్కళమాత్మరూపం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౬ ||

అర్థం – దివ్యతేజస్సు కలిగి, గుణములు ఉండి గుణములు లేక, మరొకటిగా లేక, ఆనందమునకు మూలమై, ఎవ్వరిచేత ఓడింపబడక, ఎవ్వరి ప్రమేయము అవసరములేక, నాగాభరణములు కలిగి, కళలు ఉండి కళలు లేని ఆత్మరూపము కలిగి, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం
పాపే రతిం చ సునివార్య మనః సమాధౌ |
ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౭ ||

అర్థం – ఆశలను విడిచి, పరులను నిందింపక, పాపములలో ఆనందము అనుభవింపక, మనస్సును సమాధి స్థితియందు ఉంచి, మనస్సు అనే కమలము పట్టుకొని మధ్యలో ఉన్న, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.

రాగాదిదోషరహితం స్వజనానురాగం
వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయమ్ |
మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్ || ౮ ||

అర్థం – రాగము వంటి దోషములు లేక, స్వజనులతో అనురాగముతో ఉండి, వైరాగ్యమనెడి శాంతికి నిలయమై, గిరిజతో కూడి, ధైర్యమనెడి మాధుర్యమును చూపుతూ, విషమువలన కంఠానికి ఏర్పడిన అందమైన మచ్చతో కూడి, వారాణసీ పట్టణమునకు అధిపతి అయిన విశ్వనాథుని ఆరాధించుచున్నాను.

వారాణసీపురపతేః స్తవనం శివస్య
వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః |
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షమ్ || ౯ ||

అర్థం – వారాణసీపురపతి అయిన శివుని యొక్క ఈ ఎనిమిది శ్లోకముల స్తవము పఠించు మనుషులకు విద్యలు, ఐశ్వర్యము, అమితమైన ఆనందము, అనంతమైన కీర్తి, కలిగి దేహము వదిలిన తరువాత మోక్షము కలుగును.

(ఈ అర్థము మండా కృష్ణశ్రీకాంత శర్మకు స్ఫురించి వ్రాయబడినది)

ఇతి శ్రీవిశ్వనాథాష్టకమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ శివ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

7 thoughts on “Sri Vishwanatha Ashtakam – శ్రీ విశ్వనాథాష్టకం

  1. తెలుగు లో స్తోత్రాలన్నీ చాలా చక్కగా చదువుకోవడానికి అందించే సేవ చాలా ముదావహం.

స్పందించండి

error: Not allowed