Sri Ganapathi Mangalashtakam – శ్రీ గణపతిమంగళాష్టకం


(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)

గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే |
గౌరీప్రియతనూజాయ గణేశాయాస్తు మంగళమ్ || ౧ ||

నాగయజ్ఞోపవీతాయ నతవిఘ్నవినాశినే |
నంద్యాదిగణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ || ౨ ||

ఇభవక్త్రాయ చేంద్రాదివందితాయ చిదాత్మనే |
ఈశానప్రేమపాత్రాయ చేష్టదాయాస్తు మంగళమ్ || ౩ ||

సుముఖాయ సుశుండాగ్రోక్షిప్తామృతఘటాయ చ |
సురబృందనిషేవ్యాయ సుఖదాయాస్తు మంగళమ్ || ౪ ||

చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ |
చరణావనతానర్థ తారణాయాస్తు మంగళమ్ || ౫ ||

వక్రతుండాయ వటవే వంద్యాయ వరదాయ చ |
విరూపాక్షసుతాయాస్తు విఘ్ననాశాయ మంగళమ్ || ౬ ||

ప్రమోదామోదరూపాయ సిద్ధివిజ్ఞానరూపిణే |
ప్రకృష్టపాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్ || ౭ ||

మంగళం గణనాథాయ మంగళం హరసూనవే |
మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్త్రేస్తు మంగళమ్ || ౮ ||

శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రదమాదరాత్ |
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే || ౯ ||

ఇతి శ్రీ గణపతి మంగళాష్టకమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ గణేశ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed