Sri Annapurna Mantra Stava – శ్రీ అన్నపూర్ణా మంత్ర స్తవః


శ్రీ దక్షిణామూర్తిరువాచ |
అన్నపూర్ణామనుం వక్ష్యే విద్యాప్రత్యంగమీశ్వరీ |
యస్య శ్రవణమాత్రేణ అలక్ష్మీర్నాశమాప్నుయాత్ || ౧ ||

ప్రణవం పూర్వముచ్చార్య మాయాం శ్రియమథోచ్చరేత్ |
కామం నమః పదం ప్రోక్తం పదం భగవతీత్యథ || ౨ ||

మాహేశ్వరీ పదం పశ్చాదన్నపూర్ణేత్యథోచ్చరేత్ |
ఉత్తరే వహ్నిదయితాం మంత్ర ఏష ఉదీరితః || ౩ ||

ఋషిః బ్రహ్మాస్య మంత్రస్య గాయత్రీ ఛంద ఈరితమ్ |
అన్నపూర్ణేశ్వరీదేవీ దేవతా ప్రోచ్యతే బుధైః || ౪ ||

మాయాబీజం బీజమాహుః లక్ష్మీశక్తిరితీరితా |
కీలకం మదనం ప్రాహుర్మాయయా న్యాసమాచరేత్ || ౫ ||

రక్తాం విచిత్రవాసనాం నవచంద్రజూటా-
-మన్నప్రదాననిరతాం స్తనభారనమ్రామ్ |
అన్నప్రదాననిరతాం నవహేమవస్త్రా-
-మంబాం భజే కనకమౌక్తికమాల్యశోభామ్ || ౬ ||

నృత్యన్తమిందిశకలాభరణం విలోక్య
హ్యష్టాం భజే భగవతీం భవదుఃఖహన్త్రీమ్ |
ఆదాయ దక్షిణకరేణ సువర్ణదర్పం
దుగ్ధాన్నపూర్ణమితరేణ చ రత్నపాత్రమ్ || ౭ ||

ఏవం ధ్యాత్వా మహాదేవీం లక్షమేకం జపేన్మనుమ్ |
దశాంశమన్నం జుహుయాన్మంత్రసిద్ధిర్భవిష్యతి || ౮ ||

ఏవం సిద్ధస్య మంత్రస్య ప్రయోగాచ్ఛృణు పార్వతి |
లక్షమేకం జపేన్మంత్రం సహస్రైకం హవిర్హునేత్ || ౯ ||

మహతీం శ్రియమాప్నోతి కుబేరత్రయసన్నిభామ్ |
జప్త్వైకలక్షం మంత్రజ్ఞో హునేదన్నం దశాంశకమ్ || ౧౦ ||

తత్కులేన్నసమృద్ధిస్స్యాదక్షయ్యం నాత్ర సంశయః |
అన్నం స్పృష్ట్వా జపేన్మంత్రం నిత్యం వారచతుష్టయమ్ || ౧౧ ||

అన్నరాశిమవాప్నోతి స్వమలవ్యాపినీమపి |
సహస్రం ప్రజపేద్యస్తు మంత్రమేతం నరోత్తమః || ౧౨

ఇహ భోగాన్యథాకామాన్భుక్త్వాన్తే ముక్తిమాప్నుయాత్ |
కులే న జాయతే తస్య దారిద్ర్యం కలహావళిః || ౧౩ ||

న కదాచిదవాప్నోతి దారిద్ర్యం పరమేశ్వరి |
పలాశపుష్పైర్హవనమయుతం యస్సమాచరేత్ || ౧౪ ||

స లబ్ధ్వా మహతీం కాన్తిం వశీకుర్యాజ్జగత్రయమ్ |
పయసా హవనం మర్త్యో య ఆచరతి కాళికః || ౧౫ ||

తద్గేహే పశువృద్ధిస్స్యాద్గావశ్చ బహుదుగ్ధదాః |
ఏవం మంత్రం జపేన్మర్త్యో న కదాచిల్లభేద్భయమ్ || ౧౬ ||

అసౌఖ్యమశ్రియం దుఃఖం సంశయో నాత్ర విద్యతే |
హవిష్యేణ హునేద్యస్తు నియుతం మానవోత్తమః || ౧౭ ||

సర్వాన్కామానవాప్నోతి దుర్లభానప్యసంశయః |
అన్నపూర్ణాప్రయోగోయముక్తో భక్తేష్టదాయకః |
కిమన్యదిచ్ఛసి శ్రోతుం భూయో మే వద పార్వతి || ౧౮ ||

ఇతి శ్రీమహాత్రిపురసిద్ధాన్తే అన్నపూర్ణా మంత్రస్తవః |


మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed