Nanati Baduku Natakamu – నానాటి బదుకు నాటకము


నానాటి బదుకు నాటకము |
కానక కన్నది కైవల్యము ||

పుట్టుటయు నిజము పోవుటయు నిజము |
నట్టనడిమి పని నాటకము |
యెట్టనెదుట గలదీ ప్రపంచము |
కట్టగడపటిది కైవల్యము ||

కుడిచేదన్నము కోకచుట్టెడిది |
నడమంత్రపు పని నాటకము |
వొడిగట్టుకొనిన వుభయ కర్మములు |
గడిదాటినపుడె కైవల్యము ||

తెగదు పాపము తీరదు పుణ్యము |
నగి నగి కాలము నాటకము |
యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక |
గగనము మీదిది కైవల్యము ||


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

One thought on “Nanati Baduku Natakamu – నానాటి బదుకు నాటకము

స్పందించండి

error: Not allowed