Maheshwara Pancharatna Stotram – శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]

ప్రాతః స్మరామి పరమేశ్వరవక్త్రపద్మం
ఫాలాక్షికీలపరిశోషితపంచబాణమ్ |
భస్మత్రిపుండ్రరచితం ఫణికుండలాఢ్యం
కుందేందుచందనసుధారసమందహాసమ్ || ౧ ||

ప్రాతర్భజామి పరమేశ్వరబాహుదండాన్
ఖట్వాంగశూలహరిణాహిపినాకయుక్తాన్ |
గౌరీకపోలకుచరంజితపత్రరేఖాన్
సౌవర్ణకంకణమణిద్యుతిభాసమానాన్ || ౨ ||

ప్రాతర్నమామి పరమేశ్వరపాదపద్మం
పద్మోద్భవామరమునీంద్రమనోనివాసమ్ |
పద్మాక్షనేత్రసరసీరుహ పూజనీయం
పద్మాంకుశధ్వజసరోరుహలాంఛనాఢ్యమ్ || ౩ ||

ప్రాతః స్మరామి పరమేశ్వరపుణ్యమూర్తిం
కర్పూరకుందధవళం గజచర్మచేలమ్ |
గంగాధరం ఘనకపర్దివిభాసమానం
కాత్యాయనీతనువిభూషితవామభాగమ్ || ౪ ||

ప్రాతః స్మరామి పరమేశ్వరపుణ్యనామ
శ్రేయః ప్రదం సకలదుఃఖవినాశహేతుమ్ |
సంసారతాపశమనం కలికల్మషఘ్నం
గోకోటిదానఫలదం స్మరణేన పుంసామ్ || ౫ ||

శ్రీపంచరత్నాని మహేశ్వరస్య
భక్త్యా పఠేద్యః ప్రయతః ప్రభాతే |
ఆయుష్యమారోగ్యమనేకభోగాన్
ప్రాప్నోతి కైవల్యపదం దురాపమ్ || ౬ ||

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృతం మహేశ్వర పంచరత్న స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ శివ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

3 thoughts on “Maheshwara Pancharatna Stotram – శ్రీ మహేశ్వర పంచరత్న స్తోత్రం

  1. one more slokam is there at the end
    శ్రీ పంచరత్నాని మహేశ్వరస్య భక్త్యా పఠెధ్య సుగతి ప్రభాతే
    ఆయుష్య మారొగ్య మనేక భోగాన్ ప్రాప్నోతి కైవల్య పథం దురాసదం || 6 ||

  2. హిందూ ధర్మం దృఢం కావాలంటే యువత మరింత ఇటు వైపు ఆకర్సి తులు కావాలంటే ఎవరైనా మహాను భావులు ప్రతి దినమూ పట్టించే యిటువంటి స్తోత్రాలు తెలుగు అర్థాలు ప్రచ్రించాలి.ఇతర మతాల్లో ఈ సౌకర్యం వుంది.

స్పందించండి

error: Not allowed