Brahmam Okkate – బ్రహ్మమొక్కటే


తందనాన అహి తందనాన పురె
తందనాన భళా తందనాన |

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే
పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే

కందువగు హీనాధికములిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకులమంతానొక్కటే
అందరికి శ్రీహరే అంతరాత్మ |

నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటే
అంటనే బంటునిద్ర అదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే
చండాలుడుండేటి సరిభూమి యొకటే |

అనుగు దేవతలకును అల కామ సుఖమొకటే
ఘనకీట పశువులకు కామ సుఖము ఒకటే
దినమహోరాత్రములు తెగి ధనాఢ్యులకొకటే
వొనర నిరుపేదకును ఒక్కటే అవియు |

కొరలు శిష్టాన్నములు గొను నాకలొకటే
తిరుగు దుష్టాన్నములు దిను నాకలొకటే
పరగ దుర్గంధములపై వాయువునొకటే
వరుస పరిమళముపై వాయువునొకటే |

కడగి యేనుగు మీద కాయు యెండొకటే
పుడమి శునకము మీద బొలయు యెండొకటే
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వరుని నామమొకటే |


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed