Ashvattha Stotram – అశ్వత్థ స్తోత్రం


శ్రీ నారద ఉవాచ |
అనాయాసేన లోకోఽయం సర్వాన్కామానవాప్నుయాత్ |
సర్వదేవాత్మకం చైవం తన్మే బ్రూహి పితామహ || ౧ ||

బ్రహ్మోవాచ |
శృణు దేవ మునేఽశ్వత్థం శుద్ధం సర్వాత్మకం తరుం |
యత్ప్రదక్షిణతో లోకః సర్వాన్కామాన్సమశ్నుతే || ౨ ||

అశ్వత్థాద్దక్షిణే రుద్రః పశ్చిమే విష్ణురాశ్రితః |
బ్రహ్మా చోత్తరదేశస్థః పూర్వేత్వింద్రాదిదేవతాః || ౩ ||

స్కంధోపస్కంధపత్రేషు గోవిప్రమునయస్తథా |
మూలం వేదాః పయో యజ్ఞాః సంస్థితా మునిపుంగవ || ౪ ||

పూర్వాదిదిక్షు సంయాతా నదీనదసరోఽబ్ధయః |
తస్మాత్సర్వప్రయత్నేన హ్యశ్వత్థం సంశ్రయేద్బుధః || ౫ ||

త్వం క్షీర్యఫలకశ్చైవ శీతలశ్చ వనస్పతే |
త్వామారాధ్య నరో వింద్యాదైహికాముష్మికం ఫలమ్ || ౬ ||

చలద్దలాయ వృక్షాయ సర్వదాశ్రితవిష్ణవే |
బోధిసత్త్వాయ దేవాయ హ్యశ్వత్థాయ నమో నమః || ౭ ||

అశ్వత్థ యస్మాత్త్వయి వృక్షరాజ
నారాయణస్తిష్ఠతి సర్వకాలే |
అథః శృతస్త్వం సతతం తరూణాం
ధన్యోఽసి చారిష్టవినాశకోఽసి || ౮ ||

క్షీరదస్త్వం చ యేనేహ యేన శ్రీస్త్వాం నిషేవతే |
సత్యేన తేన వృక్షేంద్ర మామపి శ్రీర్నిషేవతామ్ || ౯ ||

ఏకాదశాత్మా రుద్రోఽసి వసునాథశిరోమణిః |
నారాయణోఽసి దేవానాం వృక్షరాజోఽసి పిప్పల || ౧౦ ||

అగ్నిగర్భః శమీగర్భో దేవగర్భః ప్రజాపతిః |
హిరణ్యగర్భో భూగర్భో యజ్ఞగర్భో నమోఽస్తు తే || ౧౧ ||

ఆయుర్బలం యశో వర్చః ప్రజాః పశువసూని చ |
బ్రహ్మజ్ఞానం చ మేధాం చ త్వం నో దేహి వనస్పతే || ౧౨ ||

సతతం వరుణో రక్షేత్ త్వామారాద్వృష్టిరాశ్రయేత్ |
పరితస్త్వాం నిషేవంతాం తృణాని సుఖమస్తు తే || ౧౩ ||

అక్షిస్పందం భుజస్పందం దుస్స్వప్నం దుర్విచింతనం |
శత్రూణాం సముత్థానం హ్యశ్వత్థ శమయ ప్రభో || ౧౪ ||

అశ్వత్థాయ వరేణ్యాయ సర్వైశ్వర్య ప్రదాయినే |
నమో దుస్స్వప్ననాశాయ సుస్వప్నఫలదాయినే || ౧౫ ||

మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే |
అగ్రతః శివరూపాయ వృక్షరాజాయ తే నమః || ౧౬ ||

యం దృష్ట్వా ముచ్యతే రోగైః స్పృష్ట్వా పాపైః ప్రముచ్యతే |
యదాశ్రయాచ్చిరంజీవీ తమశ్వత్థం నమామ్యహమ్ || ౧౭ ||

అశ్వత్థ సుమహాభాగ సుభగ ప్రియదర్శన |
ఇష్టకామాంశ్చ మే దేహి శత్రుభ్యస్తు పరాభవమ్ || ౧౮ ||

ఆయుః ప్రజాం ధనం ధాన్యం సౌభాగ్యం సర్వసంపదం |
దేహి దేవ మహావృక్ష త్వామహం శరణం గతః || ౧౯ ||

ఋగ్యజుస్సామమంత్రాత్మా సర్వరూపీ పరాత్పరః |
అశ్వత్థో వేదమూలోఽసౌ ఋషిభిః ప్రోచ్యతే సదా || ౨౦ ||

బ్రహ్మహా గురుహా చైవ దరిద్రో వ్యాధిపీడితః |
ఆవృత్త్య లక్షసంఖ్యం తత్ స్తోత్రమేతత్సుఖీ భవేత్ || ౨౧ ||

బ్రహ్మచారీ హవిర్హ్యాశీ త్వదశ్శాయీ జితేంద్రియః |
పాపోపహతచిత్తోపి వ్రతమేతత్సమాచరేత్ || ౨౨ ||

ఏకహస్తం ద్విహస్తం వా కుర్యాద్గోమయలేపనం |
అర్చేత్పురుషసూక్తేన ప్రణవేన విశేషతః || ౨౩ ||

మౌనీ ప్రదక్షిణం కుర్యాత్ప్రాగుక్తఫలభాగ్భవేత్ |
విష్ణోర్నామసహస్రేణ హ్యచ్యుతస్యాపి కీర్తనాత్ || ౨౪ ||

పదే పదాంతరం గత్వా కరచేష్టావివర్జితః |
వాచా స్తోత్రం మనో ధ్యానే చతురంగం ప్రదక్షిణమ్ || ౨౫ ||

అశ్వత్థః స్థాపితో యేన తత్కులం స్థాపితం తతః |
ధనాయుషాం సమృద్ధిస్తు నరకాత్తారయేత్పితౄన్ || ౨౬ ||

అశ్వత్థమూలమాశ్రిత్య శాకాన్నోదకదానతః |
ఏకస్మిన్ భోజితే విప్రే కోటిబ్రాహ్మణభోజనమ్ || ౨౭ ||

అశ్వత్థమూల మాశ్రిత్య జపహోమసురార్చనాత్ |
అక్షయం ఫలమాప్నోతి బ్రహ్మణో వచనం తథా || ౨౮ ||

ఏవమాశ్వాసితోఽశ్వత్థః సదాశ్వాసాయ కల్పతే |
యజ్ఞార్థం ఛేదితేఽశ్వత్థే హ్యక్షయం స్వర్గమాప్నుయాత్ || ౨౯ ||

ఛిన్నో యేన వృథాఽశ్వత్థశ్ఛేదితాః పితృదేవతాః |
అశ్వత్థః పూజితో యత్ర పూజితాః సర్వదేవతాః || ౩౦ ||

ఇతి శ్రీ బ్రహ్మ నారద సంవాదే అశ్వత్థ స్తోత్రం సంపూర్ణం


మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed